iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ ‘జరగండి’ పాట విడుదల ఆలస్యానికి కారణం!

  • Published Nov 11, 2023 | 8:22 PM Updated Updated Nov 11, 2023 | 8:22 PM

రెండు రోజుల క్రితం గుంటూరు కారం సాంగ్ వచ్చింది.. తరువాత దీపావళి గేమ్ చేంజర్‌తో తమన్ రచ్చ చేస్తాడని.. మెగా అభిమానులు భావించారు. కానీ అనుకున్నట్టే మళ్లీ గేమ్ ఛేంజర్ లోని జరగండి పాట వాయిదా పడింది.

రెండు రోజుల క్రితం గుంటూరు కారం సాంగ్ వచ్చింది.. తరువాత దీపావళి గేమ్ చేంజర్‌తో తమన్ రచ్చ చేస్తాడని.. మెగా అభిమానులు భావించారు. కానీ అనుకున్నట్టే మళ్లీ గేమ్ ఛేంజర్ లోని జరగండి పాట వాయిదా పడింది.

  • Published Nov 11, 2023 | 8:22 PMUpdated Nov 11, 2023 | 8:22 PM
గేమ్ ఛేంజర్ ‘జరగండి’  పాట విడుదల ఆలస్యానికి కారణం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్  ఛేంజర్. ఈ మూవీ  అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ మూవీని  వచ్చే వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకుబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో  గేమ్ ఛేంజర్ మూవీని నుంచి వచ్చే అప్ డేట్స్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా  ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జరగండి అంటూ సాగే సాంగ్ దీపావళి పండగ సందర్భంగా విడుదల చేస్తామని గతంలో చిత్రబృందం తెలిపింది. అయితే తాజాగా  ఈ సాంగ్ వాయిదా పడినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నుంటి  వస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాల్లో బ్యూటిఫుల్ కియారా అద్వానీ కథానాయికగా నటించింది. కార్తీక్ సుబ్బరాజ్ కథను సమకూర్చుగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. అంతేకాక ఈ సినిమా నుంచి వచ్చిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ నెటిజన్ల నుండి బాగా ఆదరణ పొందింది. ఈ సినిమాకు దర్శకత్వం వస్తున్న శంకర్ ..కమల్ హాసన్ ఇండియన్ 2 కోసం కూడా పనిచేస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి గతంలో ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. జరగండి అంటూ సాగే సాంగ్ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేస్తామంటూ ప్రకటించారు. తాజాగా ఆ సాంగ్ వాయిదా పడుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక దీపావళి రావడంతో ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈ పాట విడుదల వాయిదా కానుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎక్కడ అధికారక ప్రకటన లేకపోవడంతో తప్పకుండా ఈ పాట విడుదలవుతుందని అభిమానులు ఆశగాఎదురుగా చూశారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ నుంచి జరగండి సాంగ్  వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అందుకు గల కారణాలను కూడా చిత్ర బృందం తెలిపింది. ఈ పాటకు సంబంధించి ఆడియో డాక్యుమెంటేషన్ లో పలు రకాల సమస్యలు తలెత్తాయని అందుకే వాయిదా వేస్తున్నామంటూ తెలియజేశారు. తిరిగి ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామంటూ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ ప్రకటనతో రామ్ చరణ్ అభిమానులు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ‘జరగండి’ పాట వాయిదా చర్చనీయాంశంగా మారింది. ఈ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత వ్యూస్ మరియు క్లిక్‌ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి… జరగండి సాంగ్ వాయిదా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş