iDreamPost
android-app
ios-app

దేవరలో జాన్వీ నెగిటివ్ రోల్! ఈ ట్విస్టే హైలెట్ అట!

Devara, Janhvi Kapoor: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో దేవర మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఇక దేవరకు సంబంధించిన అప్​డేట్స్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది.

Devara, Janhvi Kapoor: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో దేవర మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఇక దేవరకు సంబంధించిన అప్​డేట్స్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది.

దేవరలో జాన్వీ నెగిటివ్ రోల్! ఈ ట్విస్టే హైలెట్ అట!

‘దేవర’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్​బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అందరిలో అంచనాలు భారీగా పెరిగాయి. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక దేవరకు సంబంధించిన అప్​డేట్స్ కోసం ఆడియెన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఓ క్రేజ్ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా జూనియర్ శ్రీదేవి అయినా జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన విషయం. ఈ సినిమాలో జాన్వీ ఓ డిఫరెంట్ పాత్రలో నటిస్తుందని సమాచారం. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో దేవర మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు.  తొలిభాగం సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదకానుంది. జనతా గ్యారెజీ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో దేవర సినిమా రాబోంది. ఇక ఈ సినిమాలో అందాల తార జాన్వీ కపూర్ తారక్ కి జోడీగా నటించింది. దేవర సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి తరచూ ఏదో ఒక ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇలా దేవర నుంచి వచ్చే అప్ డేట్స్ ఎన్టీఆర్ అభిమానులు, మూవీ లవర్స్ లో జోష్ నింపుతోంది.  ఈ క్రమంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే దేవర సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.  ఇటీవలే ఈ  సినిమాలో ఓ డైలాగ్ లీకైన సంగతి తెలిసిందే. “సాదా సీదా మగాళ్ళు కావాలా..ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా…!” అనే డైలాగ్ లీక్ అయ్యింది. గూస్ పంప్స్ తెప్పిస్తున్న ఈ డైలాగ్..ప్రస్తుతం నెట్టింట్ట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ డైలాగ్ చూసిన తారక్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే సమయంలో మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో జాన్వీ నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్ గా ఉంటుందట. సినిమా సెకండాఫ్ లో జాన్వీకపూర్‌ పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌తో సాగుతుందని, ఆమె అలా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశం కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. తన క్యారెక్టర్‌లోని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ నచ్చడం వల్లే జాన్వీకపూర్‌ ఈ సినిమాకు అంగీకరించిందని టాక్. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్  కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కోసం తారక్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఈగర్ గా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి