iDreamPost
android-app
ios-app

Naga Chaitanya: రూటు మార్చిన నాగచైతన్య! ఫ్యాన్స్ కు సర్ప్రైజ్..

  • Published Jul 16, 2024 | 11:34 AM Updated Updated Jul 16, 2024 | 11:34 AM

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తన నెక్ట్స్ మూవీ కోసం రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఆ మూవీలో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఫ్యాన్స్ కు సర్ప్రైజ్. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తన నెక్ట్స్ మూవీ కోసం రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఆ మూవీలో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఫ్యాన్స్ కు సర్ప్రైజ్. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 16, 2024 | 11:34 AMUpdated Jul 16, 2024 | 11:34 AM
Naga Chaitanya: రూటు మార్చిన నాగచైతన్య! ఫ్యాన్స్ కు సర్ప్రైజ్..

హీరోలైనా, హీరోయిన్స్ అయినా.. కెరీర్ లో కొంతదూరం వచ్చాక ప్రేక్షకులకు విభిన్నంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం కథల్లో, పాత్రల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలా కనిపించి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తన రూటు మార్చి.. అభిమానులకు సర్ఫ్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య.. ప్రస్తుతం చందు మెుండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో చై కి జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత డైరెక్టర్ కార్తీక్ దండు తో ఓ మూవీ చేస్తున్నాడు. ‘విరూపాక్ష’ చిత్రంతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. దాంతో చై-కార్తీక్ కాంబినేషన్ లో వచ్చే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ మూవీని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించిన ఓ న్యూస్ పరిశ్రమలో వైరల్ గా మారింది.

కార్తీక్-చైతన్య కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. రెండు పాత్రల్లో ఓ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని టాక్. గెటప్ సైతం అందరిని ఆకట్టుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో చైతన్యకు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య నడిచే లవ్ స్టోరీ అద్భుతంగా ఉంటుందని వినికిడి. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం అవ్వనుందట. ఇక ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర(SVCC) సంస్థ నిర్మించబోతోంది. మరి తన రూటు మార్చి నాగచైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet