iDreamPost
android-app
ios-app

Janhvi Kapoor: పుష్ప 2.. సుకుమార్ కు షాకిచ్చిన దేవర బ్యూటీ!

  • Published Jul 12, 2024 | 5:33 PM Updated Updated Jul 12, 2024 | 5:33 PM

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప 2. పార్ట్ 1 కంటే హై రేంజ్ లో ఈ చిత్రం ఉండేలా సుక్కు తీర్చిదిద్దుతున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 కోసం దేవర బ్యూటీని సంప్రదించగా.. సుకుమార్ కు ఊహంచని షాకిచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప 2. పార్ట్ 1 కంటే హై రేంజ్ లో ఈ చిత్రం ఉండేలా సుక్కు తీర్చిదిద్దుతున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 కోసం దేవర బ్యూటీని సంప్రదించగా.. సుకుమార్ కు ఊహంచని షాకిచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 12, 2024 | 5:33 PMUpdated Jul 12, 2024 | 5:33 PM
Janhvi Kapoor: పుష్ప 2.. సుకుమార్ కు షాకిచ్చిన దేవర బ్యూటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ఫ 2. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ మూవీ విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక పార్ట్ 1 కంటే భారీ స్థాయిలో హిట్ కొట్టాలని సినిమాను చెక్కుతున్నాడు సుకుమార్. ఇక సుక్కు మూవీ అనగానే అందరికి గుర్తుకువచ్చేది అద్బుతమైన ఐటెం సాంగ్. పుష్పలో సమంతతో ‘ఊ అంటావా మావా’ అంటూ చిందులు వేయించి.. కుర్రకారును ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2లో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్. ఇందుకోసం దేవర బ్యూటీ జాన్వీని తీసుకోవాలని అనుకున్నాడట. కానీ సుకుమార్ కు ఊహించినని షాక్ ఇచ్చిందట ముద్దుగుమ్మ.

పుష్ప 2 మూవీలో ఐటెం సాంగ్ కోసం సుకుమార్ స్టార్ హీరోయిన్ కోసం వెతుకున్నాడట. ముందుగా శ్రీలీలతో ఈ సాంగ్ చేయిద్దామనుకున్నాక.. ఆమె క్రేజ్ తగ్గిపోవడంతో.. యంగ్ బ్యూటీని పక్కనపెట్టేశారట. ఆ తర్వాత దేవర బ్యూటీ జాన్వీ కపూర్ ను అప్రోచ్ అయ్యారట. అయితే ఈ సాంగ్ చేయడానికి జాన్వీకి అభ్యంతరం లేకపోయినప్పటికీ.. సమస్యల్లా వచ్చింది పారితోషికం దగ్గరే. ఐటెం సాంగ్ కోసం ఏకంగా రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందట జాన్వీ. దాంతో మేకర్స్ షాక్ కు గురైనట్లు సమాచారం. సమంతకే ఈ రేంజ్ పారితోషికం ఇవ్వలేదని, జాన్వీకి ఎందుకు ఇస్తారని? కొందరు ప్రశ్నిస్తున్నారు. పైగా దేవర ఇంకా రిలీజ్ కాలేదు, ఆమె క్రేజ్ తెలుగులో ఎలా ఉంటుందో తెలీదు.

ఇక దేవరలో జాన్వీ పాత్ర పండకపోతే.. పుష్ప 2లో ఐటెం సాంగ్ చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు. అదీకాక ఐటెం సాంగ్ ఎవ్వరు చేసినా.. హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. దాంతో జాన్వీకి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎవరైనా ఆలోచిస్తారు. కాగా.. సినిమా వాయిదా పడటం వల్ల మైత్రీ మూవీ మేకర్స్ పై దాదాపు రూ. 40 కోట్ల భారం పడుతోందని, దానికితోడు జాన్వీకి రూ. 4 కోట్లు అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు సినీ పండితులు. దాంతో ఈ విషయంపై మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet