iDreamPost
android-app
ios-app

రజినీ ‘జైలర్’తో కార్తీ ‘ఖైదీ’ మూవీ లింకా..? ఇదేం ట్విస్టు బ్రో!

  • Author ajaykrishna Published - 02:51 PM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 02:51 PM, Mon - 24 July 23
రజినీ ‘జైలర్’తో కార్తీ ‘ఖైదీ’ మూవీ లింకా..? ఇదేం ట్విస్టు బ్రో!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. డాక్టర్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా.. ఆగష్టు 10న పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. జైలర్ మూవీ నిడివి 2గంటల 49 నిముషాలు ఉందని.. రోబో తర్వాత రజినీ కెరీర్ లెన్త్ పరంగా బిగ్గెస్ట్ మూవీ అని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ లాంటి హేమహేమీలు నటించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

అదిగాక హీరోయిన్ తమన్నా కూడా ఇందులో నటిస్తోంది. ఇప్పటికే ఆమె చేసిన కావాలా సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. జైలర్ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో, కోలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. రజినీకాంత్ ఈ సినిమాలో పవర్ ఫుల్ జైలర్ పాత్రలో కనిపించబోతున్నారు. జైలులో ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ ని విడిపించడానికి అతని అనుచరులు జైలుపైన అటాక్ చేస్తారని.. ఆ అటాక్ ని రజినీ ఎలా అడ్డుకున్నాడు అనేది కథ అని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న గ్యాంగ్ స్టర్ గా శివరాజ్ కుమార్ కనిపించనున్నాడట.

ఈ క్రమంలో జైలర్ మూవీ జైలు ఎపిసోడ్స్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరో కార్తీ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’ మూవీని పోలి ఉంటాయని టాక్. జైలులో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఖైదీని గుర్తు చేస్తాయని అంటున్నారు. ఆ విషయంలో జైలర్ కి, ఖైదీకి లింక్ వేశారని ఫ్యాన్స్, నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆగష్టు 10 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాకు సూపర్ ఫామ్ లో ఉన్న అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. జైలర్ పై అంచనాలు పెరగడానికి రజినీ.. ఇతర స్టార్ కాస్ట్ ఎంత కారణమో.. అనిరుద్ కూడా అంతే. మరి జైలర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş