iDreamPost
android-app
ios-app

ప్రేమ కంటే ఆశించటం ఎక్కువైపోయింది.. అభిమానుల తీరు పట్ల జగపతిబాబు అసహనం

ప్రేమ కంటే ఆశించటం ఎక్కువైపోయింది.. అభిమానుల తీరు పట్ల జగపతిబాబు అసహనం

హీరోగా సింహ స్వప్నం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జగపతిబాబు ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించుకున్నారు. ఈ క్రమంలో తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు జగ్గూభాయ్. జగపతిబాబుకు కోట్లమంది అభిమానులన్నారు. ఇప్పుడు ఆ అభిమానుల వల్లనే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఫ్యాన్స్ ను కోరుతున్నాడు. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతందంటే కటౌట్లు కట్టి, భాజామోతలతో సెలబ్రేషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తుంటారు. మరి అంతలా అభిమానించే ఫ్యాన్స్ పట్ల జగ్గూభాయ్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం..

జగపతిబాబు త‌న అభిమానుల ప్రవర్తనతో అసహనానికి గురై విసుగెత్తిపోయి సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ పెట్టాడు. అభిమానులు తనకు పంచే ప్రేమకంటే తన నుంచి ఆశించడం ఎక్కువై పోయిందంటూ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన పోస్టు వైరల్ గా మారింది. అందరికి నమస్కారం. 33 ఏళ్ల నా సినీ కెరీర్‌లో అభిమానులు నా ఎదుగుదలకు ముఖ్య కారణం అని భావించా. వారి యొక్క ప్రతి కుటుంబ విషయాలలో పాల్గొని వారి కష్టాలను నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్క అభిమానులకు నీడగా ఉన్నాను.

అభిమానులంటే అభిమానం.. ప్రేమ ఇచ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్మాను.. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే కొంతమంది అభిమానులు ప్రేమతో తనని ఇబ్బంది పెట్టె పరిస్థితికి తీసుకువచ్చారని జగపతి బాబు తెలిపారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇక నుంచి అభిమాన సంఘాలు ట్రస్టుతో నాకు సంబంధం లేదు.. వాటి నుంచి విరమించుకుంటున్నాను అంటూ వెల్లడించారు. కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి.. జీవించనివ్వండి అంటూ జగపతిబాబు తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.