iDreamPost
android-app
ios-app

రేవ్ పార్టీ వీడియో.. సీనియర్ జర్నలిస్ట్ పై జబర్దస్త్ రోహిణి ఫైర్

  • Published Jul 12, 2024 | 4:10 PM Updated Updated Jul 12, 2024 | 4:10 PM

Jabardasth Rohini Fire On Senior Journalist: ఇటీవల జబర్దస్త్ రోహిణి వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె రేవ్ పార్టీలో దొరికింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత అది సినిమా ప్రమోషన్ అని తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబందించి రోహిణి సీనియర్ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Jabardasth Rohini Fire On Senior Journalist: ఇటీవల జబర్దస్త్ రోహిణి వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె రేవ్ పార్టీలో దొరికింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత అది సినిమా ప్రమోషన్ అని తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబందించి రోహిణి సీనియర్ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Published Jul 12, 2024 | 4:10 PMUpdated Jul 12, 2024 | 4:10 PM
రేవ్ పార్టీ వీడియో.. సీనియర్ జర్నలిస్ట్ పై జబర్దస్త్ రోహిణి ఫైర్

ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ఎవరికీ రాని వినూత్న తరహాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్, సమాజంలో జరుగుతున్న ఘటన ఆధారంగా ఈ ప్రమోషన్స్ ఉండటం విశేషం. అయితే ప్రతిసారి ప్రమోషన్స్ అనుకున్న విధంగా రావాలి అని ఏం ఉండదు. కానీ, కొన్నిసార్లు మాత్రం పాజిటివ్ కావాల్సింది నెగిటివ్ కూడా అవుతూ ఉంటుంది. అలాంటి ఒక పిరిస్థితి ఇప్పుడు జబర్దస్త్ రోహిణికి ఎదురైంది. బర్త్ డే బాయ్ సినిమా కోసం రోహిణి ప్రమోషన్స్ చేసింది. రేవ్ పార్టీలో దొరికింది అన్నట్లు ఒక క్లిప్ లో కనిపించింది. అయితే అది నిజంగానే జరిగింది అంటూ అంతా భావిస్తున్నారు.

అసలు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. బర్త్ డే బాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ రోహిణితో ఒక వీడియో చేయించారు. అందులో రోహిణి ఒక రేవ్ పార్టీకి వెళ్లి పోలీసులకు చిక్కినట్లు చూపిస్తారు. తాను ఏదో బర్త్ డే పార్టీ అని వచ్చాను అంటూ ఆమె మాట్లాడుతూ ఉంటుంది. పోలీసులు బలవంతంగా తీసుకెళ్తూ ఉంటారు. మొదట అంతా అది నిజమే అనుకున్నారు. కానీ, ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ అని తెలుసుకుని అదే తరహాలో ట్రీట్ చేశారు. కానీ, ఒక సీనియర్ జర్నలిస్ట్ మాత్రం అది నిజమైన సంఘటన అనుకుని ఒక వీడియోలో మాట్లాడరంట. ఇప్పుడు ఆ విషయంపైనే రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

రోహిణి మాట్లాడుతూ.. “నేను బర్త్ డే బాయ్ సినిమాకి ప్రమోషన్స్ చేశాను. అది ప్రమోషనల్ వీడియో అని తెలుసుకుని మీడియా కూడా దానిని వైరల్ చేసింది. కానీ, సీనియర్ జర్నలిస్ట్ అంట ఆయన.. వీడియోలో కూర్చుని నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఇలా రేవ్ పార్టీ అనగానే ఆ దొరికే ఉంటదిలే.. నిప్పు లేకుండా పొగ రాదు కదా అని మాట్లాడుతున్నారు. ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే మొదట మీకు దాని గురించి పూర్తి సమాచారం ఉండాలి. అయినా సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు. మరి.. అలా ఎలా మాట్లాడతారు.

ఏదైనా మాట్లాడేముందు కాస్త తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఒక ఇష్యూ గురించి ఇంటర్వ్యూకి పిలిస్తే.. అది నిజమో కాదో తెలుసుకోవాలి కదా? న్యూస్ వస్తంది అనగానే.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను మందు కూడా తాగను. అయినా మూవీస్ లో చేసిన సీన్స్ అన్నీ రియల్ లైఫ్ లే చేస్తామా? ఇంకా నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. నేను సర్జరీ వల్ల లావు అయిపోయాను.. ఇంక పెళ్లి కాదులే అని అలా ఉండిపోయింది అంటున్నారు. లావుగా ఉంటే పెళ్లిళ్లు కావా అండి? మీరు సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని” అంటూ రోహిణి కామెంట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rohini (@actressrohini)

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetbetciojojobetgrandpashabet girişcasibom