iDreamPost
android-app
ios-app

గిన్నిస్ వరల్డ్ లోకి జబర్దస్త్ రాకేష్ – సుజాత! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 11:14 AM, Thu - 27 July 23
  • Author ajaykrishna Published - 11:14 AM, Thu - 27 July 23
గిన్నిస్ వరల్డ్ లోకి జబర్దస్త్ రాకేష్ – సుజాత! వీడియో వైరల్!

బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఈ ఏడాది తనతో పాటు స్కిట్స్ లో భాగమైన జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తాజాగా గిన్నిస్ వరల్డ్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన రాకేష్.. తన కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ లో అడుగుపెట్టి.. కమెడియన్ గా పేరొందాడు. మొదట వేరే వాళ్ల టీమ్స్ లో ఉన్న రాకేష్.. ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగి సొంతంగా స్కిట్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎక్కువగా రాకేష్ స్కిట్స్ అన్ని చిన్న పిల్లలతో ఉంటాయి. ఆ తర్వాత న్యూస్ ప్రెజెంటర్ అయిన సుజాత ఎంట్రీ ఇవ్వడంతో.. ఆమెతో కలిసి స్కిట్స్ చేసి మరింత పేరు తెచ్చుకున్నాడు.

ఇక కొన్నాళ్ళు సుజాతతో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపి.. ఈ ఏడాది మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. మరోవైపు సుజాత కూడా న్యూస్ ప్రెజెంటర్ నుండి బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టి.. మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. అయితే.. పెళ్లి తర్వాత రాకేష్ – సుజాత ఇద్దరు టైమ్ దొరికితే వేకెషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాకేష్, సుజాత ఇద్దరు ఫారెన్ వేకెషన్ లో ఉన్నారు. అక్కడికి వెళ్లి.. అక్కడ వీరు తిరిగిన ఏరియాలలో వ్లాగ్ వీడియోస్ పెడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రెజెంట్ ఈ జంట ఐర్లాండ్ లో ఉన్నారు. ప్రముఖ బీర్ కంపెనీ గిన్నిస్ కంపెనీని వీక్షించారు. ఆ గిన్నిస్ కు సంబంధించి వీడియో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతోంది.

రాకేష్, సుజాత గిన్నిస్ వరల్డ్ రికార్డులో అడుగు పెట్టారంటే వేరే అనుకోకండి. వీళ్ళేం చేశారు.. గిన్నిస్ లోకి వెళ్లడానికి అని షాక్ అవ్వకండి. రాకేష్ సుజాత వెళ్ళింది.. గిన్నిస్ అనే బీర్ కంపెనీకి వెళ్లారు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరి గిన్నిస్ వరల్డ్ వ్లాగ్.. వైరల్ అవుతుండగా.. వీడియోపై నెటిజన్స్, ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మరి జబర్దస్త్ ద్వారా ఒక్కటైన రాకేష్, సుజాత.. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సమక్షంలో గ్రాండ్ గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. మరి రాకేష్ సుజాతల జంట గురించి.. వీరి గిన్నిస్ వరల్డ్ టూర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio