పోలీస్ స్టేషన్‌లో రియాజ్.. పాత వీడియోపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల అరెస్ట్ కి సంబంధించి వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య పుష్ప నటుడు జగదీశ్, పక్కింటి కుర్రాడు ఫేమ్ చందు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చందు సాయి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్ పై స్పందించాడు కూడా. తాజాగా జబర్దస్త్ కమెడియన్ రియాజ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పోలీస్ రియాజ్ ని కొడుతున్నాడు. అయితే దీనిపై రియాజ్ స్పందించాడు.

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల అరెస్ట్ కి సంబంధించి వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య పుష్ప నటుడు జగదీశ్, పక్కింటి కుర్రాడు ఫేమ్ చందు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చందు సాయి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్ పై స్పందించాడు కూడా. తాజాగా జబర్దస్త్ కమెడియన్ రియాజ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పోలీస్ రియాజ్ ని కొడుతున్నాడు. అయితే దీనిపై రియాజ్ స్పందించాడు.

ఇటీవల కాలంలో కొంచెం పాపులర్ అయిన సెలబ్రిటీలకు సంబంధించి అరెస్ట్ వార్తలు ఎక్కువయ్యాయి. ఆ మధ్య పుష్ప నటుడు జగదీశ్ ఓ మహిళ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత పక్కింటి కుర్రాడుగా పాపులర్ అయిన చందు సాయి అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం చందు విడుదలై బయటకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తన తప్పు లేదని చందు సాయి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయినప్పటికీ చందు మీద నెగిటివ్ గా కథనాలు అల్లుతున్నారు. తాజాగా మరో నటుడు, కమెడియన్ విషయంలో అదే జరిగింది.

జబర్దస్త్ రియాజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్, పటాస్ వంటి కామెడీ షోస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అలాంటి రియాజ్ కి సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. రియాజ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు.. పోలీస్ అతన్ని కొడుతున్న వీడియో ఒకటి గత నాలుగు రోజులుగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై రియాజ్ స్పందించాడు. అది నిజమే కానీ అది పాత వీడియో అని వెల్లడించాడు. అలా ఎందుకు జరిగిందో మీడియా ముందుకొచ్చి స్పష్టత ఇచ్చాడు.

ఈ క్రమంలో తనకు సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. 2019లో ఒక ప్రాంక్ వీడియో వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేస్తే రియాజ్ వెళ్లి మాట్లాడి రావడం జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో తనను కొట్టడం, చులకన చేయడం, బ్లేమ్ చేయడం చేశారని అన్నాడు. దాన్ని వీడియో రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారని.. ఆ విషయం తనకు తెలియదని వెల్లడించాడు. అక్కడ ఉండే కానిస్టేబుల్ దాన్ని రికార్డ్ చేశారని చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు దేవుడి దయ వల్ల తాను ఉన్నత స్థాయిలో ఉన్నానని.. కానీ కావాలని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారని అన్నాడు. తన ఎదుగుదల ఓర్వలేక, తనను తొక్కడానికే ఇలా పాత వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తన అనుమతి లేకుండా ఆ వీడియోని షేర్ చేస్తున్నారని.. ఎవరైతే తన వీడియో షేర్ చేసి వైరల్ చేస్తున్నారో వారి మీద ఫిర్యాదు చేశానని.. అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో చేదు సంఘటనలు అనేవి సహజం. వాటిని ఆ వ్యక్తి ఎదిగిన తర్వాత బయటపెట్టి అతని క్రేజ్ ని డ్యామేజ్ చేయాలనుకోవడం చాలా తప్పు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments