iDreamPost
android-app
ios-app

‘దేవర’ రామాయణాన్ని పోలి ఉంటుందోమో- పరుచూరి గోపాలకృష్ణ

  • Published Sep 18, 2024 | 4:49 PM Updated Updated Sep 18, 2024 | 4:49 PM

Devara: ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కనున్న సినిమా దేవర.  ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ రావడమే కాకుండా.. మూవీపై భారీ అంచనాలను కూడా పెంచింది.  ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ట్రైలర్ ప ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Devara: ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కనున్న సినిమా దేవర.  ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ రావడమే కాకుండా.. మూవీపై భారీ అంచనాలను కూడా పెంచింది.  ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ట్రైలర్ ప ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

  • Published Sep 18, 2024 | 4:49 PMUpdated Sep 18, 2024 | 4:49 PM
‘దేవర’ రామాయణాన్ని పోలి ఉంటుందోమో- పరుచూరి గోపాలకృష్ణ

‘దేవర’.. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఈ సినిమా పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే అందుకు కారణం యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే..దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ హీరో సోలో గా స్రీన్ పై అలరించనున్నాడు. దీంతో ఎప్పుడెప్పుడు తెరపై ఈ సినిమా చూస్తామనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎగ్జైట్మెంట్ కు బూస్ట్ ఇచ్చేలా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇటు ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సినీ ప్రియులకు కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ మూవీ ఈ సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ పై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కనున్న సినిమా దేవర.  ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ రావడమే కాకుండా.. మూవీపై భారీ అంచనాలను కూడా పెంచింది.  ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ట్రైలర్ ప ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దేవర’ టీంకు శుభాకాంక్షలు చెబుతూ  ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేశారు. ఇక ఆ వీడియోలో పరుచూరి మాట్లాడుతూ.. ‘దేవర ట్రైలర్ లో రావణాసురుడి కోసం రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందులో కొన్ని సన్నివేశాలు రూపొందించారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే.. రాముడు సముద్రాన్ని దాటినట్లు ‘దేవర’ లోనూ ఎన్టీఆర్ పడవపై నిల్చొని సముద్రాన్ని దాటుతున్నట్లు చూపించారు. ఇందులో మా చిన్నరామయ్య (ఎన్టీఆర్) పాత్ర చాా గమ్మత్తుగా ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఇక ఇందులో దేవర, భైరవగా కనిపించనున్నాడు. అయితే ఇందులో దేవర అంటే హీరో అని అర్ధమవుతోంది. మరి బైరవ విలన్ వైపు ఉంటాడేమో అనిపించింది. అలాగే హీరోయిన్ తో (జాన్వీ కపూర్) సరదాగా, అమాయకత్వంగా మాట్లాడడం చూస్తే.. కొరటాల శివ తన స్క్రీన్ప్లేతో ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో డైలెగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అందులో ‘రక్తంతో సముద్రం ఎరుపెక్కే కథ’ అని అన్నారు. అంటే సముద్రంలోనే యుద్ధం జరుగుతుందని ఓ డైలాగుతో చెప్పారు. అలాగే ‘మనిషికి బతికేంత దైర్యం చాలు.. చంపేంత కాదు’ అని డైలాగ్ ఉంది. ఈ డైలాగుతో ఎన్నో ఆలోచనలు కలిగించారు. ఇక ‘దేవరని చంపాలంటే సరైన సమయమే కాదు.. సరైన ఆయుధమూ దొరకాలి’ అన్నారు.

ఈ డైలాగ్ వింటే.. రామాయణంలోనూ రాముడు ఎన్నో బాణాలు ఉపయోగించాడు. అలానే ఇందులోనూ ఎన్నో ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తుంటే ఈ సినిమాలోని ప్రతీ అంశం రామాయాణాన్ని పోలి ఉంటుందని అనిపిస్తుంది’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే దేవర సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. మరి, దేవర మూవీ ట్రైలర్ పై పరుచూరి గోపాలకృష్ణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.