iDreamPost
android-app
ios-app

దసరా సీక్వెల్‌పై ఇంట్రస్టింగ్ అప్ డేట్! సైలెంట్‌గా కానిస్తున్నారా!

  • Published Mar 26, 2024 | 5:57 PM Updated Updated Mar 26, 2024 | 5:57 PM

క్లాస్, మాస్ సినిమాలు చేస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. దసరాలో ఊర మాస్ లుక్కులో కేక పుట్టించిన నాని.. హాయ్ నాన్నలో ఫ్యామిలీ మాన్ గా ఆకట్టుకున్నాడు. కాగా, ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

క్లాస్, మాస్ సినిమాలు చేస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. దసరాలో ఊర మాస్ లుక్కులో కేక పుట్టించిన నాని.. హాయ్ నాన్నలో ఫ్యామిలీ మాన్ గా ఆకట్టుకున్నాడు. కాగా, ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

  • Published Mar 26, 2024 | 5:57 PMUpdated Mar 26, 2024 | 5:57 PM
దసరా సీక్వెల్‌పై ఇంట్రస్టింగ్ అప్ డేట్! సైలెంట్‌గా కానిస్తున్నారా!

నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి జోష్ మీదున్నాడు. శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి డిఫరెంట్ రోల్స్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ బాయ్స్ నెక్ట్ డోర్ గాయ్. అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న ఈ చిత్రాలు ఆయన మార్కెట్‌ను మరింత పెంచాయి. దసరాలో ఊరమాస్, యాక్షన్ ఎలివేషన్లలో కనిపించాడు నాని. ఈ దసరా నిరుడు లెక్క ఉండదు అంటూ ధరణి పాత్రలో అరుపులు పుట్టించాడు ఈ నాచురల్ స్టార్. గత ఏడాది మార్చిలో రిలీజైన దసరా మూవీ.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సుమారు రూ. 65 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 120 కోట్లను కొల్లగొట్టింది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్ర ఖని, సాయి కుమార్, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి కొత్త కుర్రాడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. దీనికి నలుగురు రైటర్స్ పని చేశారు. సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను సూపర్ హిట్ ట్రాక్ పట్టించాయి. ధరణి, వెన్నెల, సూరి పాత్రలు గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. దసరా సీక్వెల్ తెరకెక్కబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో జరగబోతుందని సమాచారం. ఈ ఏడాది సెకండాఫ్‌లో స్టార్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో కూడా కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం,  సుజిత్ డైరెక్షన్లలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక ఈ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. మరింత యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. దసరా సినిమా అంతా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సినిమా సాగింది. బతుకు దెరువు కోసం బొగ్గు దొంగిలించే యువకుడి పాత్రలో కనిపించాడు నాని. చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమించే వెన్నెలను తన స్నేహితుడు సూరి కోసం వదులకుంటాడు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటాడు. అనూహ్యంగా పెళ్లి రోజే సూరి హత్యకు గురౌతాడు. ఆ తర్వాత వెన్నెలను పెళ్లి చేసుకుని.. ఆమెపై మోజు పడ్డ చిన్న నంబిని ఎలా అంతమొందించాడు అనేది మిగిలిన కథ. ఏడు సంవత్సరాల జైలు శిక్ష తర్వాత గ్రామానికి వస్తాడు ధరణి. ఇప్పుడు ఇక్కడి నుండి కొత్త కథ మొదలు అవుతుందేమో చూడాలి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet