iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్-దేవర మధ్య పోలికలా? ఇదెక్కడి గోల?

Game Changer-Devara: శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ అలాగే కోరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ మధ్య ఒకే విధమైన పోలికలు ఉన్నాయంటున్నారు. మరి నిజంగానే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయా? ఓసారి పరిశీలిద్దాం పదండి.

Game Changer-Devara: శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ అలాగే కోరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ మధ్య ఒకే విధమైన పోలికలు ఉన్నాయంటున్నారు. మరి నిజంగానే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయా? ఓసారి పరిశీలిద్దాం పదండి.

గేమ్ ఛేంజర్-దేవర మధ్య పోలికలా? ఇదెక్కడి గోల?

యాదృచ్చికమో.. కాకతాళీయమో.. కొన్ని సినిమాలు ఒకేతీరులో ఉంటాయి. వాటి మధ్య పోలికలు ఒకేలా ఉన్నాయంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు కూడా. ఇక ఇందులో ఒక సినిమా హిట్ కావడం మరో సినిమా ఫ్లాప్ కావడం లాంటి ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా వస్తాయి. మరికొన్ని సార్లు రెండు మూవీస్ బంపర్ హిట్స్ కొడతాయి. ఇలాంటి పోలికే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ అలాగే కోరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ మధ్య ఒకే విధమైన పోలికలు ఉన్నాయంటున్నారు. మరి నిజంగానే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయా? ఓసారి పరిశీలిద్దాం పదండి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఇక మరోవైపు కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ‘దేవర’. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఇండస్ట్రీ మెుత్తం ఈ రెండు చిత్రాల గురించి ఓ విషయంలో చర్చించుకుంటున్నాయి. అదేంటంటే? రెండు సినిమాలు ఒకే విధమైన బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రాలట. తండ్రి ఆశయం కోసం కొడుకులు పోరాడే కథే ఈ రెండు చిత్రాల్లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు దేవర లో కూడా  తారక్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరు వారి వారి సినిమాల్లో కనిపించబోతున్నారు. ఈ రెండు మూవీల్లో తండ్రులు దగ్గరి వ్యక్తుల చేతుల్లో మోసపోవడం, వారిపై కొడుకులు పగ తీర్చుకోవడం ఉమ్మడి లక్షణంగా తెలుస్తోంది. దీన్ని బట్టే రెండు సినిమాల మధ్యలో పోలికలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే గేమ్ ఛేంజర్ పూర్తిగా పొలిటికల్ డ్రామా. ఇక దేవర విషయానికి వస్తే.. పూర్తిగా యాక్షన్ మూవీ. వేటికవే సెపరేట్.

ఇదిలా ఉండగా.. తండ్రీని మోసం చేసిన విలన్స్ పై కొడుకులు పగ తీర్చుకోవడం అన్నది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. కానీ దానిని స్క్రీన్ పై డైరెక్టర్ ఎలా ప్రజెంట్ చేశాడు అన్నదే ఇక్కడ కీలకాంశం. ఇప్పుడు దేవర-గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు ఒకే సెటప్పులో వస్తున్నాయని కొందరు పేర్కొంటున్నారు. కాగా.. దేవర రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు. మరి రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి