iDreamPost

ఈ ఇద్దరు అన్నాదమ్ములు.. హీరోలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు

ఈ ఫోటోలోని అన్నాదమ్ములు.. ఇండస్ట్రీని తమ నటనతో షేక్ చేసేస్తున్నారు. అన్న కన్నా ఆయన తమ్ముడు ఇంకా పాపులర్.. అతడికి పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరంటే..?

ఈ ఫోటోలోని అన్నాదమ్ములు.. ఇండస్ట్రీని తమ నటనతో షేక్ చేసేస్తున్నారు. అన్న కన్నా ఆయన తమ్ముడు ఇంకా పాపులర్.. అతడికి పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరంటే..?

ఈ ఇద్దరు అన్నాదమ్ములు.. హీరోలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు

ఒకరి నుండి మరొకరు నటనా రంగంలోకి రావడం కామన్. తండ్రి, కొడుకులు మాత్రమే కాదు.. అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్లు కూడా ఇండస్ట్రీలోకి ఎంటరై సత్తా చాటుతున్నారు. కానీ తండ్రి కన్నా కొడుకు.. అన్న కన్నా తమ్ముడు ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు దగ్గర నుండి నేటి మెగాస్టార్ ఫ్యామిలీ వరకు ఆ దిగ్గజాల నట వారసులు వచ్చి.. వారి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న సంగతి విదితమే. ఇక్కడే కాదు.. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఇదే పంథా కొనసాగుతుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు కూడా అన్నాదమ్ములు. కాకపోతే.. అన్నా కన్నా తమ్ముడు ఎక్కువ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నాడు.

అయితే అన్నకు తక్కువ పేరుందనుకోవద్దు.. ఆ ఇండస్ట్రీలో అతడి పేరు తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు స్టార్ హీరోలు. ఇంతకు ఆ స్టార్ హీరోస్ ఎవరంటే.. మాలీవుడ్ అన్నాదమ్ములు. ఈ ఇద్దరికీ టాలీవుడ్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరు ప్రస్తుతం నేరుగా తెలుగు సినిమాల్లో నటించడం గమనార్హం. తమ్ముడు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీల్లో బిజీయెస్ట్ యాక్టర్. తన సొంత సినీ పరిశ్రమలో సూపర్ స్టార్. ఈ అన్నాదమ్ముల్లో ఒకరు ఇంద్రజిత్ సుకుమారన్, మరొకరు పృధ్వీరాజ్ సుకుమారన్. ఇంద్రజిత్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. హీరోగా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇంద్రజిత్ తెలుగులో చార్మి, మంజుల ఘట్టమనేని తెరకెక్కించిన కావ్యాస్ డైరీ చిత్రంలో మంజుల హస్బెండ్ పాత్రలో మెరిశాడు.

ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ విషయానికి వస్తే.. అన్ని ఇండస్ట్రీలో కాలు పెట్టాడు. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుడిగా అతడికి పేరు ఉంది. అందుకు ఉదాహరణ గోట్ లైఫ్-ఆడు జీవితం.  ఓ సినిమా కోసం సుమారు 16 ఏళ్లు కేటాయించడంటే.. అతడికి పనిపై ఎంత నిబద్దత ఉందో చెప్పొచ్చు. 2002 నుండి కెరీర్ స్టార్ చేసిన ఇతగాడు.. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అతడు సినిమాలు తెలుగులో డబ్ అయ్యి.. మంచి వ్యూస్ సాధించాయి. ఉరిమి, పికెట్ 43, ఎజ్రా, లూసిఫర్, గోల్డ్ కేస్, బ్రో డాడీ, జనగణ మన వంటి చిత్రాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. తెలుగులో పోలీస్ పోలీస్ అనే చిత్రంతో పాటు సలార్ ది సీజ్ ఫైర్ మూవీలో యాక్ట్ చేశాడు. వరద రాజా మన్నార్ పాత్రలో మెప్పించాడు పృధ్వీ రాజ్ సుకుమారన్. అట్లాగే తమిళంతో పాటు హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి