Krishna Kowshik
Indra Movie: చిరంజీవి, సోనాని బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇంద్ర. ఇందులో వీణ స్టెప్ ఎంతగా గుర్తుకువస్తుందో.. మీది తెనాలే మాది తెనాలే మనది తెనాలే అనే కామెడీ సీన్ కూడా అంతే గుర్తుండిపోతుంది. ఈ సీనులో నటించిన చైల్ట్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
Indra Movie: చిరంజీవి, సోనాని బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇంద్ర. ఇందులో వీణ స్టెప్ ఎంతగా గుర్తుకువస్తుందో.. మీది తెనాలే మాది తెనాలే మనది తెనాలే అనే కామెడీ సీన్ కూడా అంతే గుర్తుండిపోతుంది. ఈ సీనులో నటించిన చైల్ట్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
Krishna Kowshik
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటి ఇంద్ర. ఈ మూవీ పేరు చెప్పగానే.. దాయి దాయి దామ్మా వీణ స్టెప్పే గుర్తుకు వస్తుంది. ఇక ఈ సినిమాలో సీరియస్ ట్రాక్‌తో పాటు కామెడీ ట్రాక్ నడుస్తుంది. కాశీకి వచ్చే టూరిస్టులను బురిడీ కొట్టించే పాత్రలో నవ్వులు పువ్వులు పూయించారు బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ. ఇందులో తెనాలి నుండి వస్తారు బచ్చు పెద్ద పిచ్చయ్య ఫ్యామిలీ( ఏవీఎస్ ఫ్యామిలీ). తెనాలి నుండి అనగానే.. ‘మీది తెనాలే, మాది తెనాలే..మనది తెనాలే’ అంటూ వారిని మోసం చేస్తారు ఈ ముగ్గురు. పెద్ద పిచ్చయ్యగా ఏవీఎస్ నటించాడు. చిన్న పిచ్చయ్యగా ఆకట్టుకున్నాడు ఓ బుడ్డోడు. ఇంతకు ఆ పిల్లోడు ఎవరు..? ఇప్పుడు ఎంతలా మారిపోయాడో తెలుసా.? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
ఇంద్రలో చైల్ట్ ఆర్టిస్టుగా నవ్వించిన చిన్నోడి పేరు శివ దుర్గా ప్రసాద్. అతని ముద్దు పేరు బంటి. సుమారు 80 చిత్రాల్లో నటించిన ఈ పిల్లాడు.. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఇంద్ర మూవీనే కాదు.. ఫ్యామిలీ సర్కస్ చిత్రంలో జగపతి బాబుని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. జగపతి బాబు కారు టైర్ లాగేసుకుని పరిగెత్తించేది ఈ బుడ్డోడే. ‘దీంతో నా టైర్ పోయింది.. ఎక్కడైనా దొరికిందా’ అంటూ అడుక్కునే పరిస్థితి హీరో. చాలా మందికి ఈ సీన్ కూడా గుర్తుండిపోతుంది. ఇవే కాకుండా బడ్జెట్ పద్మనాభంలో చిన్నప్పటి జగపతి బాబు క్యారెక్టర్ చేశాడు. అదే కాదు క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రంలో కూడా బ్రహ్మానందం కొడుకుగా యాక్ట్ చేశాడు ఈ బాల నటుడు. అలాగే ఎవడిగోల వాడిదే, వాడంతే అదో టైప్, దేవ, సుల్తాన్, ఔనన్న కాదన్నా, గంగోత్రి, ఒక విచిత్రంవంటి చిత్రాలు చేశాడు. ఇవే కాదు బుల్లితెరపై కూడా మంచి సీరియల్స్ చేశాడు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన శాంతి నివాసంతో పాటు ప్రముఖ కామెడీ ధారావాహిక అమృతంలో గుండు హనుమంతరావు కొడుకుగా నటించాడు దుర్గా ప్రసాద్. చిరంజీవి మీద అభిమానంతో కొడుకును నటుడ్ని చేయాలనుకుంది అతడి తల్లి. అలా బాలనటుడిగా ఆకట్టుకున్నాడు. అయితే చదువులు దృష్ట్యా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ నటుడు.. ఇంజనీరింగ్, ఎంబీఎ చేశాడు. ఇప్పుడు సీనియర్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాడు కానీ.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి వెల్లడించాడు. సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి తనకు ఇష్టమైన దర్శకులు చాలా ఇష్టమని చెప్పాడు. తనకు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలనుందన్న కోరికను బయటపెట్టాడు.