iDreamPost
android-app
ios-app

Uday Kiran: వైరల్ అవుతున్న ఈ గ్రూప్ ఫొటో వెనుక ఉన్న కథ మీకు తెలుసా?

  • Published Nov 02, 2024 | 4:13 PM Updated Updated Nov 02, 2024 | 4:13 PM

Uday Kiran- Tarun- Sada- Aarthi Agarwal Viral Pic: టాలీవుడ్ ప్రేక్షకులకు లవర్ బాయ్స్ అంటే తరుణ్- ఉదయ్ కిరణ్ అనే చెప్పాలి. ఇంక ఫేవరెట్ హీరోయిన్స్ అంటే సదా- ఆర్తీ అగర్వాల్ పేరు చెప్పేస్తారు. మరి.. ఆ నలుగురు కలిసి దిగిన ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పైగా ఆ పిక్ వెనుక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. మరి.. ఆ కథ ఏంటో చూసేయండి.

Uday Kiran- Tarun- Sada- Aarthi Agarwal Viral Pic: టాలీవుడ్ ప్రేక్షకులకు లవర్ బాయ్స్ అంటే తరుణ్- ఉదయ్ కిరణ్ అనే చెప్పాలి. ఇంక ఫేవరెట్ హీరోయిన్స్ అంటే సదా- ఆర్తీ అగర్వాల్ పేరు చెప్పేస్తారు. మరి.. ఆ నలుగురు కలిసి దిగిన ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పైగా ఆ పిక్ వెనుక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. మరి.. ఆ కథ ఏంటో చూసేయండి.

  • Published Nov 02, 2024 | 4:13 PMUpdated Nov 02, 2024 | 4:13 PM
Uday Kiran: వైరల్ అవుతున్న ఈ గ్రూప్ ఫొటో వెనుక ఉన్న కథ మీకు తెలుసా?

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేమకథలు అంటే మహా మక్కువ. అలాంటి ప్రేమకథల్లో కేవలం కొందరిని మాత్రమే హీరోలుగా యాక్సెప్ట్ చేసేవాళ్లు. అలాంటి లవర్ బాయ్స్ లిస్ట్ లో కచ్చితంగా ఉండే పేర్లు ఉదయ్ కిరణ్, తరుణ్. అలాగే లవ్లీ హీరోయిన్స్ అనే లిస్ట్ లో కచ్చితంగా ఉండే పేర్లు సదా- ఆర్తీ అగర్వాల్. ఈ భామలు ఇప్పటికే 90s కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్స్ అనే చెప్పాలి. ఎంత ఫేవరెట్ యాక్టర్స్ అయినా కూడా వారిని ఇప్పుడు వెండితెర మీద చూడలేకపోతున్నారు. అందుకు వివిధ కారణాలు ఉన్నాయి. సందర్భం లేకుండా ఇప్పుడు ఆ నలుగురి ప్రస్తావన ఎందుకు వచ్చింది అని కంగారు పడకండి. అందుకు ఒక వైరల్ ఫొటో కారణం అని చెప్పాలి. ఉదయ్ కిరణ్, తరుణ్, సదా, ఆర్తీ అగర్వాల్ కలిసి దిగిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పిక్ చూసిన నెటిజన్స్ దానిని లైక్ చేయడంతో ఆగిపోవడం లేదు. అసలు ఈ నలుగురు ఏ సందర్భంలో కలిశారు? ఆ పిక్ వెనుక ఏదైనా విశేషం ఉందా అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. నిజానికి ఆ ఫొటో వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. మరి.. ఆ కథ ఏంటి? ఆ ఫొటో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోందో చూద్దాం.

ఉదయ్ కిరణ్- తరుణ్- సదా- ఆర్తీ అగర్వాల్.. ఈ నలుగురి కెరీర్లు నాలుగు విధాలుగా ముగిసిపోయాయి. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్నే విడిచివెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని చాలించాడు. ఆ విధంగా ఉదయ్ కిరణ్ తన అభిమానులనే కాకుండా.. తెలుగు సినీ ప్రేక్షకులను శోక సంధ్రంలో ముంచాడు. ఇంక ఆర్తిఅగర్వాల్ కూడా ఇప్పుడు మన మధ్య లేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఊహించని రీతిలో అభిమానులకు దూరమైంది. హీరో తరుణేమో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మళ్లీ ఎప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇస్తాడో కూడా చెప్పే పరిస్థితి లేదు. తరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను తెలుగు ప్రేక్షకులు గట్టిగానే మిస్ అవుతున్నారు. అలాగే సదా కూడా కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే సదా విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఉన్నారు. బుల్లితెర అయితే ఏంటి.. తరచూ తమని పలకరిస్తోంది కదా అని ఆనందపడుతున్నారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఈ వైరల్ ఫొటో హీరోలు- హీరోయిన్లు వారి వారి సినిమాలను ప్రమోట్ చేస్తున్న సమయంలో తీసింది. ఈరోజుల్లో వెంట వెంటనే సినిమాలు రిలీజులుంటే.. రెండు సినిమా టీమ్స్ కలిసి ఒక ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాయి. నిజానికి ఈ స్ట్రాటజీని 2005లోనే వాడేశారు. అప్పట్లో తరుణ్- ఆర్తీ అగర్వాల్ జంటగా.. సోగ్గాడు సినిమా విడుదల అవుతోంది. అలాగే ఉదయ్ కిరణ్- సదా జంటగా చేసిన ఔనన్నా- కాదన్నా సినిమా కూడా రిలీజ్ అవుతోంది. రెండూ చిత్రాలు కేవలం ఒక్క వారం గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీళ్లు నలుగురు హుస్సేన్ సాగర్ లో సందడి చేశారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్ లో బోట్ లో ఉండగా తీసిందే ఈ వైరల్ గ్రూప్ ఫొటో.

ఈ చిత్రాన్ని ఒక సీనియర్ ఫొటో గ్రాఫర్ షేర్ చేయడంతో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఈ వింటేజ్ పిక్ చూసిన నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఉదయ్ కిరణ్- ఆర్తీ అగర్వాల్ ని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే తరుణ్- సదా కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నలుగురు స్టార్స్ తమ నటనతో, ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ వారిపై ఇంతటి అభిమానం చూపిస్తున్నారు అంటే.. వారి నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి.. ఈ వైరల్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom