iDreamPost
android-app
ios-app

ఈ యాడ్‌లో త్రిష కాకుండా.. ఓ స్టార్ హీరో ఉన్నాడు.. గుర్తు పట్టారా..?

  • Published Jan 05, 2024 | 7:57 PM Updated Updated Jan 05, 2024 | 7:57 PM

మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్లు ఇండస్ట్రీకి రాక ముందు మోడల్స్ లేదా ప్రకటనల్లో నటించిన వాళ్లే. అలాగే హీరోలు సైతం చిన్న చిన్న షోస్ లేదా యాడ్స్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాడ్‌లో ఓ స్టార్ హీరో ఉన్నాడు.

మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్లు ఇండస్ట్రీకి రాక ముందు మోడల్స్ లేదా ప్రకటనల్లో నటించిన వాళ్లే. అలాగే హీరోలు సైతం చిన్న చిన్న షోస్ లేదా యాడ్స్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాడ్‌లో ఓ స్టార్ హీరో ఉన్నాడు.

  • Published Jan 05, 2024 | 7:57 PMUpdated Jan 05, 2024 | 7:57 PM
ఈ యాడ్‌లో త్రిష కాకుండా.. ఓ స్టార్ హీరో ఉన్నాడు.. గుర్తు పట్టారా..?

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలా మంది సినిమాల్లో రాణించక ముందు.. మోడల్స్ లేదా యాడ్స్‌లో నటించిన వారే. అక్కడి నుండే వారి ప్రయాణం మొదలు అవుతుంది. ఆ తర్వాత మెల్లిగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ నటులుగా ఎదుగుతూ ఉంటారు. చిన్న క్యారెక్టర్ వచ్చినా వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తూ ఉంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ అందుకు ఓ ఉదాహరణ. ఆ యాడ్‌లో చేశారు అంటే.. హీరోయిన్ అయిపోయినట్లే లెక్క. ఇక హీరోలు కూడా అడపా దడపా ప్రకటనల్లో కనిపించిన వారే. బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ బాయ్‌గా ఉన్నప్పుడు కంప్లైన్, పెప్సీలో యంగ్ బాయ్‌గా షారూఖ్ పక్కన నటించాడు.

ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ కూడా ఓ యాడ్‌లోనిదే. ఇది వివీల్ సోప్ యాడ్. ఇందులో త్రిషతో పాటు నటించాడో హీరో. అతడెవరో గుర్తు పట్టారా..? ఎవరో కాదండీ.. వర్సటైల్ యాక్టర్.. వెరీ డౌన్ టు ఎర్త్ హీరో.. శివ కార్తికేయన్. ఈ ప్రకటన 13 ఏళ్ల క్రితం నాటిది. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ఫేమస్ అయ్యింది. ‘వచ్చింది.. వచ్చింది గుండు మల్లిక’ అంటూ వచ్చేది.. కాలేజీలో అమ్మాయిలను ర్యాగింగ్ చేసే బ్యాచ్‌లో కనిపిస్తాడు మన హీరో. ఆ ఏడిపించే అమ్మాయి కూడా ఇప్పుడో స్టార్ నటి. ఇక కార్తీకేయన్ తెలుగు వారికి సుపరిచితమే. కౌసల్య కృష్ణ మూర్తితో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు ఈ స్టార్ నటుడు. ఆ తర్వాత ప్రిన్స్ అనే మూవీలో కూడా మెరిశాడు.

మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసిన శివ.. షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. యాడ్స్ చేస్తూనే.. సినిమాల్లో సైడ్ క్యారెకర్స్, సపోర్టింగ్ రోల్స్‌లో యాక్ట్ చేశాడు. మారినా అనే మూవీతో హీరోగా మారాక కూడా.. ధనుష్, శృతి హాసన్ మూవీ త్రీలో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కెరీర్ పై దృష్టి పెట్టి కంటెంటున్న హీరోగా ఎదిగాడు. తొలి నుండి రజనీకాంత్ ఫ్యాన్‌గా చెప్పుకుంటున్న అతడు.. అతడి పేరుతోనే రజిని మురుగన్ చిత్రంతో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రోమియో.. మంచి హిట్ అందుకుంది. అక్కడి నుండి వెను దిరిగి చూసుకోలేదు. ఇటీవల మావీరన్ మూవీతో వచ్చిన శివ కార్తీకేయన్.. ఈ సంక్రాంతికి అయలాన్ సినిమాతో అలరించబోతున్నాడు. అతడి సినిమాల్లో మీకు ఏ చిత్రం ఇష్టమో.. కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio