iDreamPost

కల్కి 2898 AD సినిమాపై బన్నీ రియాక్షన్.. వరల్డ్ క్లాస్ అంటూ..

Icon Star Allu Arjun On Kalki 2898 AD Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా.. కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించి తన రివ్యూని పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Icon Star Allu Arjun On Kalki 2898 AD Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా.. కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించి తన రివ్యూని పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కల్కి 2898 AD సినిమాపై బన్నీ రియాక్షన్.. వరల్డ్ క్లాస్ అంటూ..

కల్కి 2898 ఏడీ సినిమాకి ప్రపంచం నలు దిక్కుల నుంచి అప్లాజ్ లభిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఈ విజువల్ వండర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాలను చిన్నపాటి రివ్యూల రూపంలో అందిస్తున్నారు. ఆ లిస్టులో కేవలం అభిమానులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు మాత్రమే కాదు.. నిర్మాతలు, హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అంతా ఉన్నారు. ఇప్పటి వరకు చాలామంది తమ రివ్యూని సోషల్ మీడియాలో వెల్లడించారు. తాజాగా ఆ లిస్టులోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. తాను కల్కి సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది అనే విషయాన్ని చెప్పడమే కాకుండా.. టీమ్ మొత్తానికి అభినందనలు తెలియజేశాడు.

కల్కి సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తోంది. మొదటి రెండురోజుల్లోనే ఏకంగా 298.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ అబ్బుర పరిచింది. ఈ మూవీ కచ్చితంగా 1400 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనాలు కట్టేస్తున్నారు. అలాగే సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వీకెండ్ కాబట్టి ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా తన ఒపీనియన్ ని పంచుకున్నాడు. పేరు పేరున అల్లు అర్జున్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చాడు.

అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులో.. “కుడోస్ టూ కల్కి 2898 ఏడీ మూవీ టీమ్. అవుట్ స్టాండింగ్ విజువల్ వండర్. ఇలాంటి ఎపిక్ మూవీ చేసినందుకు నా ప్రియమైన మిత్రుడు ప్రభాస్ గారి మీద గౌరవం పెరిగింది. బచ్చన్ గారు మీరు నిజంగా చాలా స్ఫూర్తిదాయకులు. మీ గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. డియర్ దీపికా నువ్వు స్టన్నింగ్. దిశా పఠానీ.. నిన్ను చాలా అందంగా చూపించారు. అందరు టెక్నీషియన్స్, క్రూ, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యమ్స్ ఎడిట్- మేకప్ అందరికీ స్పెషల్ కాంప్లిమెంట్స్. అభినందనలు. ఇలాంటి రిస్కీ స్టెప్ తీసుకుని.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచినందుకు.. వైజయంతి మూవీస్, నిర్మాతలకు ప్రత్యేక ప్రశంసలు. కెప్టెన్ నాగ్ అశ్విన్ గారు ప్రతి ఒక్క సినిమా అభిమానిని వావ్ అనేలా చేశారు. మన జెరేషన్ లో హద్దులు చెరిపేసిన ఫిల్మ్ మేకర్ మీరు” అంటూ అల్లు అర్జున్ అందరిపై ప్రశంసలు కురిపించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి