iDreamPost
android-app
ios-app

iBOMMA వార్నింగ్​పై మౌనం! ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?

  • Author singhj Updated - 08:39 PM, Thu - 7 September 23
  • Author singhj Updated - 08:39 PM, Thu - 7 September 23
iBOMMA వార్నింగ్​పై మౌనం! ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?

iBOMMA.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ పేరు తెలియని తెలుగు సినీ గోయర్స్​ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఓటీటీల్లోకి వచ్చిన ప్రతి తెలుగు మూవీ కొన్ని గంటల్లోనే ఐబొమ్మలోకి వచ్చి తీరుతుందనేది తెలిసిందే. ఇలా ఓటీటీ మూవీస్ ఐబొమ్మలోకి ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్నా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రోజులు మారుతున్న కొద్దీ ఐబొమ్మ తన వెబ్​సైట్​లో మార్పులు చేస్తూ వస్తోంది. ఓటీటీలోనే కాదు థియేటర్​లో విడుదలైన చిత్రాలు కూడా ఐబొమ్మలోకి రావడంతో.. సినీ పరిశ్రమకు ఇది పెను సవాల్​గా మారింది. దీంతో ఈ వెబ్​సైట్​ మీద టాలీవుడ్ ఫోకస్ పెట్టింది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమను టార్గెట్​ చేస్తోందంటూ ఐబొమ్మ సీరియస్​గా రియాక్ట్ అయింది. తమ మీద ఫోకస్ పెడితే.. తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. తమ మీద దృష్టి పెడితే.. తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తింది. డిస్ట్రిబ్యూటర్స్​కు ప్రింట్స్ అమ్మిన తర్వాత ఏమీ తెలియనట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్లపై కాకుండా.. ఓటీటీ రెవెన్యూ గురించి ఆలోచిస్తూ.. తమపై ఫోకస్ పెట్టారని ఐబొమ్మ సీరియస్ అయ్యింది. హీరోలు, హీరోయిన్లకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అని ప్రశ్నించింది.

లైట్ బాయ్స్, సెట్ బాయ్స్ కూలీ పెంచితే వారి కుటుంబాలు బాగుపడతాయని ఐబొమ్మ పేర్కొంది. ఐబొమ్మ ఓపెన్ వార్నింగ్ ఇచ్చినా టాలీవుడ్ నుంచి మాత్రం ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం. కొన్నేళ్ల కింద తమిళ ఇండస్ట్రీలో ఇలాగే ఓ ఘటన జరిగింది. తమిళ్ రాకర్స్ అనే వెబ్​సైట్ తమిళ కొత్త చిత్రాలు విడుదలైన వెంటనే తమ సైట్​లో అందుబాటులో ఉంచేది. అయితే ఈ విషయాన్ని సైలెంట్​గా చూస్తూ వచ్చిన కోలీవుడ్ పెద్దలు.. ఆ వెబ్​సైట్ వాళ్లను పట్టుకొని దాన్ని లేకుండా చేశారు. కానీ ఇక్కడ ఐబొమ్మ ఓపెన్​గా హెచ్చరిస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. 

కోలీవుడ్​లాగే టాలీవుడ్​ పెద్దలు కూడా ప్లాన్ చేసుకుని ఐబొమ్మను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా? లేదా మనకెందుకని సైలెంట్​గా ఉంటున్నారా? అనేది అర్థం కావడం లేదు. ఐబొమ్మ వార్నింగ్ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో తమిళ్ రాకర్స్​ను కోలీవుడ్ క్లోజ్ చేసినట్లే.. ఐబొమ్మ విషయంలోనూ ప్లానింగ్ జరుగుతోందని వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది ఇండస్ట్రీ వర్గాలకే తెలియాలి. మరి.. ఐబొమ్మ హెచ్చరించినా టాలీవుడ్ నుంచి రియాక్షన్ లేకపోవడంపై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తెర పైకి దివ్య భారతి బయోపిక్!