iDreamPost
android-app
ios-app

తెరపైకి దివ్య భారతి బయోపిక్! తమన్నాకి లక్కీ ఛాన్స్!

  • Author ajaykrishna Updated - 03:29 PM, Thu - 7 September 23
  • Author ajaykrishna Updated - 03:29 PM, Thu - 7 September 23
తెరపైకి దివ్య భారతి బయోపిక్! తమన్నాకి లక్కీ ఛాన్స్!

సినీ ఇండస్ట్రీలో నిజ జీవిత కథల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ఒక్కోసారి అర్ధాంతరంగా జీవితాలు ముగించిన సెలబ్రిటీల లైఫ్ స్టోరీస్ కూడా తెరపైకి వస్తుంటాయి. అలా కెరీర్ లో స్టార్డమ్ సంపాదించుకొని.. పీక్స్ స్టేజ్ కి చేరుకుంటున్న టైమ్ లో ఆకస్మికంగా మరణించిన వారిలో సిల్క్ స్మిత, దివ్యభారతి పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. అయితే.. ఆల్రెడీ సిల్క్ స్మిత లైఫ్ మీద ‘డర్టీ పిక్చర్’ మూవీ పదేళ్ల క్రితమే వచ్చింది. ఆ సినిమాలో సిల్క్ స్మితగా బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటించింది. ఆ సినిమాలో నటనకు గాను విద్యాకు ఏకంగా నేషనల్ అవార్డు లభించింది. అలా మహానటి సావిత్రి బయోపిక్, తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్స్ కూడా తెరపైకి వచ్చాయి.

ఇక ఇప్పటిదాకా బయోపిక్స్ లో కీర్తి సురేష్, కంగనా రనౌత్, విద్యా బాలన్ లాంటి హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నప్పుడే నటించారు. ఇప్పుడు తమన్నాకి బయోపిక్ లో నటించే టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. దివంగత క్రేజీ హీరోయిన్ దివ్య భారతి లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో తమన్నా నటిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా దివ్య భారతి లైఫ్ స్టోరీ పైనే తెరకెక్కుతుందని టాక్ నడుస్తుంది. కానీ.. ఖచ్చితంగా ఆమెదే అని ఎవరు కన్ఫర్మేషన్ రాలేదు. 90లలో ప్రేక్షకులకు దివ్యభారతిని మర్చిపోవడం అంత ఈజీ పని కాదు. టీనేజ్ లోనే హీరోయిన్ గా మారిన దివ్యభారతి.. తెలుగులో బొబ్బిలి రాజా సినిమాతో డెబ్యూ చేసింది.

మొదటి సినిమానే మంచి హిట్ కావడంతో వరుసగా అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు లాంటి సూపర్ హిట్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత నా ఇల్లే నా స్వర్గం, చిట్టెమ్మ మొగుడు లాంటి ప్లాప్స్ వల్ల దివ్యభారతి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. తెలుగులో దివ్య భారతి లాస్ట్ మూవీ తొలిముద్దు. ఆ సినిమా టైమ్ లోనే దివ్యభారతి..1993 ముంబైలో తన స్వంత అపార్ట్ మెంట్ లో అంతస్థు పైనుంచి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ టైమ్ లో దివ్యభారతి మరణం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇప్పుడీ సంఘటన ఆధారంగా మలయాళంలో దిలీప్ హీరోగా బాంద్రా రూపొందుతోంది. ఈ సినిమాలో దివ్య భారతి రోల్ లో తమన్నా కనిపించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు అరుణ్ గోపి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. తమన్నా దివ్యభారతి రోల్ ప్లే చేయనుందని తెలిసి.. లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. మరి దివ్య భారతి క్యారెక్టర్ లో తమన్నా ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabethiltonbet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet