Venkateswarlu
పాయల్ రాజ్‌పుత్ తాజాగా మంగళవారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పాయల్ రాజ్‌పుత్ తాజాగా మంగళవారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Venkateswarlu
తీసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. అందం, అభినయం ఉన్నా అవకాశాలు సరిగా రావటం లేదు. పాయల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పటికి 5 ఏళ్లు పైనే అవుతోంది. ఈ ఐదేళ్లలో ఆమె కేవలం 7 సినిమాలు మాత్రమే చేశారు. పాయల్ హీరోయిన్‌గా నటించిన చిత్రాల్లో ఎక్కువగా ప్లాపులో ఉన్నాయి. దీంతో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. ఆశించిన స్థాయిలో రావటం లేదు.
ఆమె తాజాగా, మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నవంబర్ 17న విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా శభాష్ అనిపించుకుంది. పాయల్‌కు హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చిన అజయ్ భూపతినె ఈ మూవీకి దర్శకత్వం వహించారు. తన రెండో సినిమాతోనూ ఆమెకు మరో బ్రేక్ ఇచ్చారు. మంగళవారం మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక, అసలు విషయానికి వస్తే పాయల్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క చనిపోయింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ సారీ కాండీ, నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. నేను ఢీలా పడిపోయాను. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను. నేను నిన్ను నిజంగా మిస్ అవుతున్నాను. నీ కౌగిళ్లను మిస్ అవుతున్నాను. నువ్వు ప్రేమతో నన్ను నాకడాన్ని మిస్ అవుతున్నాను. నువ్వు ఇంకా నా దగ్గరే ఉన్నట్లు అనిపిస్తోంది. నేను నా జీవితాంతం నిన్ను మిస్ అవుతాను.
ఇదంతా అన్‌కండిషనల్ ప్రేమ. ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండాలి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు సాధారణ నెటిజన్లు కూడా తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పాయల్ తన పెంపుడు కుక్క చనిపోయిన బాధనుంచి తొందగా బయటపడాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కూడా పెడుతున్నారు. కాగా, పాయల్ రాజ్‌పుత్ ‘‘ చన్న మెరెయ’’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
మాతృ భాషలోనే మొదటి సినిమా చేశారు. తర్వాత 2018లో వచ్చిన ‘వీరేకి వెడ్డింగ్’ అనే మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరం ‘‘ ఆర్‌ఎక్స్ హడ్రెండ్ ’’ చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీ మామ, సీత, ఆర్‌డీఎక్స్ లవ్, డిస్కో రాజా, అనగనగా ఓ అతిధి, జిన్నా, మాయపేటిక వంటి సినిమాల్లో నటించారు. మరి, పాయల్ పెంపుడు కుక్క చనిపోవటంతో ఆమె ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.