iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. సౌత్ ని ఊపేస్తున్న స్టార్ హీరోయిన్..

  • Published Aug 10, 2024 | 1:40 AM Updated Updated Aug 10, 2024 | 1:40 AM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అయితే పేరకు తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు బాగా సుపరిచితమే. కేవలం మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో క్రుర్రాళ్ల మనసును దోచేసింది ఈ బ్యూటీ. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అయితే పేరకు తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు బాగా సుపరిచితమే. కేవలం మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో క్రుర్రాళ్ల మనసును దోచేసింది ఈ బ్యూటీ. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 10, 2024 | 1:40 AMUpdated Aug 10, 2024 | 1:40 AM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. సౌత్ ని ఊపేస్తున్న స్టార్ హీరోయిన్..

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెలబ్రిటీ త్రో బ్యాక్ ఫోటో ట్రెండ్ అనేది ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వారి పుట్టినరోజులు కానీ, మూవీ రిలీజ్, రి రీలిజ్ అయినా చాలు.. సోషల్ మీడియాలో వారికి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, టీనేజ్ ఫోటోస్, స్కూల్, కాలేజీ నాటి ఫోటోలు అంటూ ఏదో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ఈరోజు మరో ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు  దక్షిణాది ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అయితే పేరకు తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు బాగా సుపరిచితమే. కేవలం మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో క్రుర్రాళ్ల మనసును దోచేసింది ఈ బ్యూటీ. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. యాపిల్ బ్యూటీ ‘హన్సిక మోత్వానీ’. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈమె మొదటిగా తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే హిందీలోని పలు సీరియల్స్ లో, సినిమాల్లో బాలనటిగా నటింది ఈ బ్యూటీ. అలా బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సికకు కొన్నాళ్లకు వెండితెరపై ఆఫర్స్ వచ్చాయి.

Heroine, Hansika Motwani, Tollywood, Movie News, 1

ఈ క్రమంలోనే మొదట టాలీవుడ్ లోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 2007లో విడుదలైన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఇక తొలి సినిమాతోనే కుర్రళ్ల క్రష్ మారిన ఈ బ్యూటీ ఆ తర్వాత.. తెలుగులో ఎన్టీఆర్ కంత్రి, రామ్ పోతినేని కందిరీగ, ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది. కానీ, ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో.. ఈ బ్యూటీ పూర్తిగా తమిళ్ ఇండస్ట్రీకి మాకం మార్చింది. ఇక అక్కడ జయం రవితో ఎంగేయుమ్ కాదల్, నటుడు విజయ్‌తో వేలాయుతం, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో ఒరు కల్ ఒరు గీమ్, రోమియో అండ్ జూలియట్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించింది.

అయితే ప్రస్తుతానికి హన్సిక కోలివుడ్ లోనే పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లో అలరిస్తూ బిజీగా ఉంది. ఇక హన్సికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.  ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో ఈమెను కుట్టి ఖుష్బూ అని కూడా పిలుస్తారు. ఇక ఈ విషయం పక్కన పెడితే. ఈ బ్యూటీ ముంబైలోని 1991, ఆగస్టు 9వ తేదీన జన్మించింది. ఇక ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపారస్తుడు కాగా, తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన డెర్మటాలజిస్ట్. ఇకపోతే హన్సిక మోత్వానీ 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది. కాగా, నేడు ఈమె పుట్టినరోజు కావడంతో..సెలబ్రిటీస్, ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ బ్యూటీకి పెద్ద ఎత్తునే విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ, హన్సిక చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet