iDreamPost
android-app
ios-app

ఆ పని చేయకండి.. ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ రిక్వెస్ట్!

  • Published Jul 24, 2024 | 3:36 PM Updated Updated Jul 24, 2024 | 3:36 PM

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ విషయంలో తన అభిమానులకు ఓ పోస్ట్ పెట్టాడు. దయచేసి ఆ పని చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ విషయంలో తన అభిమానులకు ఓ పోస్ట్ పెట్టాడు. దయచేసి ఆ పని చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

  • Published Jul 24, 2024 | 3:36 PMUpdated Jul 24, 2024 | 3:36 PM
ఆ పని చేయకండి.. ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ రిక్వెస్ట్!

సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా మూవీస్  అప్ డేట్స్,  ఇతర సమాచారలు వైరల్ అవుతుంటాయి. ఇదే సమయంలో లీకుల బెడద సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోంది. పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు ప్రతి దానిని  ఈ ముప్పు అనేది ఎదురువుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడడ ఎక్కువగా ఉంటుంది. అలానే తాజాగా విజయ దేవర కొండ సినిమాకు సంబంధించి ఓ ఫోటో లీక్ అయింది. అయితే దానిని అభిమానులు ఎవ్వరు షేర్ చేయవద్దంటూ  అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ అసలుస్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

విజయ్ దేవరకొండ ..  ఈ పేరు టాలీవుడ్ ఆడియన్స్  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్  రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి మారారు విజయ్. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం సినిమాతో తన క్రేజ్ మరింత పెంచుకున్నారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన… ఆ రెండు సినిమా రేంజ్ లో మరో హిట్ ను అందులేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో పని చేస్తున్నాడు. చాలా మంది టాలీవుడ్ హీరోల మాదిరిగానే విజయ్ సినిమాకు కూడా లీకుల బెడద వచ్చింది. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా నుంచి కూడా ఓ లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఇటీవల కాలంలో విజయ్ నటించిన లైగర్, ఖుషి, సినిమాలు ఆశించిన స్థాయిలో ఫ్యాన్సు ఆకట్టుకోలేకపోయాయి. అలానే ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఈ నేపథ్యంలో విజయ్ వరుసగా మూడు సినిమాలను లైనప్ చేశాడు. ఇటీవలే ఈ రౌడీ హీరో పుట్టిన రోజున ఈ సినిమాలను ప్రకటించారు. వీటిలో జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ విజయ్ కి  12వ సినిమా కావడం విశేషం. అందుకే VD12 పేరుతో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది. గతంలో ఈ సినిమా నుంచి ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్న విషయం తెలిసింది. అక్కడి సముద్ర తీరంలో జరుగుతోన్న షూట్ నుంచి ఓ ఫోటో లీకైంది.

ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో విజయ్ చాలా వెరైటీగా కనిపిస్తున్నాడు. అయితే ఈ ఫోటో లీక్ అవ్వడంతో VD12 మూవీ మేకర్స్ అలెర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా విజయ్ ఓ పోస్ట్ ను షేర్ చేశారు. అభిమానులకు ర్వికెస్ట్ చేస్తూ.. వారికోసం మంచి సినిమా తీసుకురాబోతునట్లు తెలిపాడు. ఇదే సమయంలో VD12 టీమ్ కూడా చాలా కష్టపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి లీకైన ఫోటోను షేర్ చేయవద్దని, త్వరలో బిగ్ సర్ ప్రైజ్ ఇస్తానంటూ విజయ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş