iDreamPost
android-app
ios-app

ఘనంగా వెంకటేశ్ రెండో కుమార్తె వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోస్

  • Published Mar 16, 2024 | 8:53 AM Updated Updated Mar 16, 2024 | 8:53 AM

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఎంతో అంగరంగ వైభవంగా దగ్గుబాటి వారి డాటర్ వివాహ వేడుకలు జరిగాయి.

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఎంతో అంగరంగ వైభవంగా దగ్గుబాటి వారి డాటర్ వివాహ వేడుకలు జరిగాయి.

  • Published Mar 16, 2024 | 8:53 AMUpdated Mar 16, 2024 | 8:53 AM
ఘనంగా వెంకటేశ్ రెండో కుమార్తె వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోస్

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో.. సినీ ఇండస్ట్రీలో వరుస పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈమధ్యకాలంలో అయితే ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా వరుస సెలబ్రిటీస్ పెళ్లిలు, నిశ్చితార్ధ వేడుకలతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఇక స్టార్ సెలబ్రిటీస్ కాకుండా.. వారి పిల్లల వివాహ వేడుకలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట ఆయన రెండో కుమార్తె హవ్యవాహినికి.. విజయవాడకు చెందిన డాక్టర్‌తో గతంలో నిశ్చితార్ధ వేడుకలు జరగగా..అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇకపోతే వీరి వివాహం ఈనెల అనగా మార్చి 15న హైదరాబాద్ లో జరగనున్నట్లు సమాచారం తెలిసిందే. అయితే అనుకున్న తేదీకే దగ్గుబాటి వారి డాటర్ వివాహ వేడుకలు నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్‏తో ఘనంగా జరిగింది. కాగా, నిన్న అనగా శుక్రవారం (మార్చి15)న రాత్రి 9 36 నిమిషాలకు వెంకటేశ్ కుమార్తె వివాహం రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ముందురోజు గురువారం నాడు.. జరిగిన మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబసభ్యులు సందడి చేసిన సంగతి తెలిసిందే. అందులో మహేష్ సతీమణి నమ్రత.. ఆయన కూతురు సితార మెహందీ వేడుకలలో పాల్గొన్నారు.

Venkatesh's daughter's wedding

ఇక హవ్యవాహిని నిశ్చితార్థం గతేడాది అక్టోబర్ లో జరిగింది. కాగా, ఈ వేడుకలకు చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే వెంకటేశ్, నీరజ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ఆశ్రిత, హవ్యవాహిని, భావనతోపాటు.. కుమారుడు అర్జున్ ఉన్నారు.అయితే పెద్ద కుమార్తె ఆశ్రితకు 2019లో వివాహం జరగిన విషయం తెలిసిందే. మరి, కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వెంకటేశ్ కుమార్తె హవ్యవాహిని, నిషాంత్ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş