iDreamPost
android-app
ios-app

Suhas: ప్రాణ ప్రతిష్ట రోజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన సుహాస్‌ దంపతులు!

  • Published Jan 22, 2024 | 7:43 PM Updated Updated Jan 22, 2024 | 7:43 PM

అయోధ్యలో బాల రాముడు కొలువు దీరిన వేల హీరో సుహాస్‌ దంపతులు ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయోధ్యలో బాల రాముడు కొలువు దీరిన వేల హీరో సుహాస్‌ దంపతులు ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Published Jan 22, 2024 | 7:43 PMUpdated Jan 22, 2024 | 7:43 PM
Suhas: ప్రాణ ప్రతిష్ట రోజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన సుహాస్‌ దంపతులు!

ప్రాణ ప్రతిష్ట రోజు హీరో సుహాస్‌ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి. సుహాస్‌ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సుహాస్‌ అందరికీ తెలియజేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘‘ మగబిడ్డ.. ప్రొడక్షన్‌ నెంబర్‌ 1’’ అంటూ కొంచెం ఫన్నీగా స్పందించాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకున్న ఫొటో జత చేశాడు. సుహాస్‌ చేతిలో బిడ్డ ఉన్నాడు. సుహాస్‌ ఎంతో అపురూపంగా ఆ బిడ్డను చూస్తూ ఉన్నాడు.

పక్కన ఆస్పత్రి బెడ్‌పై ఉన్న సుహాస్‌ భార్య లలిత కూడా ఆ బిడ్డను చేత్తో తాకుతూ అపురూపంగా చూస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటోపై నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. నటుడు గెటప్‌ శ్రీను ‘ శుభాకాంక్షలు డార్లింగ్‌’ అని.. కామెడియన్‌ హర్ష ‘ శుభాకాంక్షలు’ అని స్పందించారు. వీరితో పాటు నటుడు సుదర్శన్‌, హీరోయిన్‌ చాందినీ చౌదరి, శివానీ రాజశేఖర్‌, ప్రత్యూష తదితరులు సుహాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Suhas couple gave birth to a baby boy!

కాగా, సుహాస్‌ యూట్యూబర్‌గా జీవితాన్ని మొదలుపెట్టాడు. చాయ్‌ బిస్కట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. పలు షార్ట్‌ ఫిల్మ్‌లు చేశాడు. తర్వాత 2018లో వచ్చిన ‘ పడి పడి లేచే మనసు’ తో మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హీరో శర్వానంద్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేశాడు. తర్వాత పలువురు హీరోలకు ఫ్రెండ్‌గా నటించాడు. కలర్‌ ఫొటో మూవీతో హీరోగా మారాడు. ఈ చిత్రంలో సుహాస్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కలర్‌ ఫొటోకు నేషనల్‌ అవార్డు సైతం వచ్చింది.

2023లో సుహాస్‌ ‘రైటర్‌ పద్మభూషణం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. సుహాస్‌ ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. 2024, ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, హీరో సుహాస్‌ దంపతులు మగబిడ్డకు జన్మనివ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss