iDreamPost
android-app
ios-app

గట్టిగా కొట్టిన సుహాస్.. మూడ్రోజుల్లోనే సినిమా లాభాల్లోకి!

  • Published Feb 05, 2024 | 4:47 PM Updated Updated Feb 05, 2024 | 4:47 PM

Ambajipeta Marriage Band 3 Days Collections: హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా మూడ్రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

Ambajipeta Marriage Band 3 Days Collections: హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా మూడ్రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

  • Published Feb 05, 2024 | 4:47 PMUpdated Feb 05, 2024 | 4:47 PM
గట్టిగా కొట్టిన సుహాస్.. మూడ్రోజుల్లోనే సినిమా లాభాల్లోకి!

సుహాస్.. చిన్న హీరోగా వచ్చి ఇండస్ట్రీలో పెద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. మనోడు ఒక కథను ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమా హిట్టు కొట్టినట్లే అనే భావన అయితే తెలుగు ప్రేక్షకుల్లో పడిపోయింది. సుహాస్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్ చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సుహాస్ స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుందో. అలాంటి హీరో నుంచి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అంటూ ఒక సినిమా వస్తోంది అంటే అందరిలో అంచనాలు భారీగానే ఉంటాయి. పైగా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ అవుతుందని స్వయంగా హీరోనే చెప్పాడు. ఇంకేముంది ఎక్స్ పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఏకంగా మూడ్రోజుల్లోనే లాభాళ బాట పట్టిందని తెలుస్తోంది.

సుహాస్ నుంచి సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ ఉంటుందనే విషయాన్ని సుహాస్ మరోసారి ప్రూవ్ చేశాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు పేరుతో వచ్చిన సినిమా టాలీవుడ్ లో గట్టిగానే రీసౌండింగ్ ఇస్తోంది. నిజానికి ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే చాలామంది ఫిక్స్ అయిపోయారు.. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని. అందరూ అనుకున్నట్లుగానే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ ఎంతో గొప్ప సక్సెస్ ని సాధించింది. క్రిటిక్స్ కూడా ఈ మూవీకి మంచి మార్కులు వేశారు. ఇంకేముంది ఇప్పుడు థియేటర్లు మొత్తం ఈ మూవీనే దున్నేస్తోంది. దానికి తగినట్లుగానే అద్భుతమైన కలెక్షన్స్ ని కూడా రాబడుతోంది.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా రెండ్రోజుల్లోనే రూ.5.16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇంక ఆదివారం అయితే శుక్ర, శనివారాలకు మించి టికెట్లు తెగాయి. ఇంకేముంది.. మొత్తం మూడ్రోజులకు కలిపి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.8.06 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రకటించారు. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.3 కోట్ల వరకు జరిగిందని టాక్ నడిచింది. అంటే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేవలం మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈ వెన్ క్రాస్ అయినట్లు అర్థమైపోతోంది. టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ కేవలం మూడ్రోజుల్లోనే లాభాల్లోకి ఎంటర్ కావడంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

 

Suhas (@suhassssssss) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

సుహాస్ హార్డ్ వర్కర్ మాత్రమే కాదు.. సుహాస్ లక్కీ హీరో కూడా అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ల మ్యారేజీ బ్యాండ్ మ్యూజిక్కే గట్టిగా వినిపిస్తోంది. రిలీజ్ కి ముందే సినిమా ప్రమోషన్స్ లో సుహాస్ ఎంతో బలంగా చెప్పాడు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని. కథ విన్నప్పుడే గట్టిగా కొట్టబోతున్నాం అని సుహాస్ నమ్మాడు. అందుకే ఈ సినిమా కోసం తాను రెండుసార్లు గుండు కూడా చేయించుకున్నాడు. అసలు కథ రాసిందే తనని దృష్టిలో ఉంచుకుని కాబట్టి సుహాస్ నటించాడు అనే కంటే.. జీవించాడు అనడం చాలా బెటర్ గా ఉంటుంది. హీరో సుహాస్ నమ్మినట్లుగానే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. మరి.. కేవలం మూడ్రోజుల్లోనే సుహాస్ సినిమా లాభాల్లోకి ఎంటర్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş