iDreamPost
android-app
ios-app

శ్రీకాంత్ కొడుకు సినిమా లైన్లోకి.. ‘కల్కి’ డైరెక్టర్ చేతుల మీదుగా !

  • Published Aug 17, 2024 | 4:25 PM Updated Updated Aug 17, 2024 | 4:25 PM

Srikanth Son Roshan Champion Movie Update: ఒకప్పుడు హీరో శ్రీకాంత్ సినిమాలకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో తర్వాత తరం మొదలైంది. శ్రీకాంత్ తనయుడు ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా లైన్ లోకి రాబోతున్నాడు.

Srikanth Son Roshan Champion Movie Update: ఒకప్పుడు హీరో శ్రీకాంత్ సినిమాలకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో తర్వాత తరం మొదలైంది. శ్రీకాంత్ తనయుడు ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా లైన్ లోకి రాబోతున్నాడు.

  • Published Aug 17, 2024 | 4:25 PMUpdated Aug 17, 2024 | 4:25 PM
శ్రీకాంత్ కొడుకు సినిమా లైన్లోకి.. ‘కల్కి’ డైరెక్టర్ చేతుల మీదుగా !

తెలుగు ఇండస్ట్రీకి కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించిన వారిలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. అప్పటికి ఇప్పటికి శ్రీకాంత్ కు ఉండే ఫ్యాన్ బేస్ ఏమి మారలేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలను తీసిన శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు కొత్త తరం మొదలైంది. ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ శ్రీకాంత్ తనయుడు రోషన్.. నిర్మలా కాన్వెంట్ , పెళ్ళి సందD సినిమాలతో.. వెండి తెరకు పరిచయం అయ్యాడు కానీ.. ఈ రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్ నే సంపాదించుకున్నాయి. తాజాగా రోషన్ ఓ ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా మళ్ళీ లైన్ లోకి రాబోతున్నాడని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పెళ్లి సందD సినిమా తర్వాత రోషన్ సినిమాల గురించి.. ఎలాంటి అప్ డేట్స్ లేవు. దీనితో అందరిలో రోషన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడా.. ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడు అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా రోషన్ నెక్స్ట్ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో రోషన్ నెక్స్ట్ మూవీ ‘ఛాంపియన్’ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను కల్కి సినిమాని నిర్మించి వైజయంతి మూవీస్ కు.. అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఛాంపియన్ సినిమాను.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదగా క్లాప్ కొట్టి.. పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సినిమా అనౌన్స్ చేసిన సంవత్సరం తర్వాత.. మూవీని స్టార్ట్ చేశారు. మరి ఈసారి రోషన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఒకవేళ ఇప్పుడు రాబోయే సినిమా కనుక మంచి టాక్ సంపాదించుకుంటే.. రోషన్ ట్రాక్ లో పడినట్లే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి.. ఆ పోటీని తట్టుకుని.. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తే మాత్రం.. శ్రీకాంత్ లా రోషన్ కూడా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకుంటాడని చెప్పడంలో.. ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈసారి రోషన్ మెప్పిస్తాడా లేదా అనే దానికోసం వెయిట్ చేయాల్సిందే. మరి రోషన్ కొత్త సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap