iDreamPost
android-app
ios-app

Raj Tarun Movie: రాజ్ తరుణ్-మాల్వీ మల్హోత్రా మూవీ వాయిదా.. వివాదానికి భయపడేనా?

  • Published Jul 11, 2024 | 1:33 PM Updated Updated Jul 11, 2024 | 1:33 PM

టాలీవుడ్‌ యంగ్ హీరో రాజ్‌తరుణ్ కేసులో రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా పై జరుగుతున్న నెగిటివిటి కారణంగా.. వారిద్దరు నటించిన తిరగబడర సామీ సినిమాను రిలీజ్ చేయడం కష్టమని తాజాగా ఈ సినిమాను వాయిదా వేశారు.

టాలీవుడ్‌ యంగ్ హీరో రాజ్‌తరుణ్ కేసులో రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా పై జరుగుతున్న నెగిటివిటి కారణంగా.. వారిద్దరు నటించిన తిరగబడర సామీ సినిమాను రిలీజ్ చేయడం కష్టమని తాజాగా ఈ సినిమాను వాయిదా వేశారు.

  • Published Jul 11, 2024 | 1:33 PMUpdated Jul 11, 2024 | 1:33 PM
Raj Tarun Movie: రాజ్ తరుణ్-మాల్వీ మల్హోత్రా  మూవీ వాయిదా.. వివాదానికి భయపడేనా?

గత వారం రోజులుగా లావణ్య అనే యువతి టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని పలు ఆరోపణలు చేసింది. అంతేకాకుండా.. తనని మోసం చేసి, బేదిరించినందుకు గాను రాజ్ తరుణ్ పై, అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్ర పై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది. అలాగే మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్, మాల్వీతో రిలేషన్ లో ఉన్నాడని ఈ కారణంతోనే నన్ను ప్రేమించి వదిలేసడని పలు సంచలన నిజాలు బయటపెట్టింది. అయితే ఈ గొడవ పై మొదట్లో రాజ్ తరుణ్ తో పాటు మాల్వీ కూడా స్పందించి ఆమెపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చిన లావణ్య పలు ఆరోపణలు చేయడమే కాకుండా.. రాజ్ తరుణ్ తనని మోసం చేసినట్టు సరైన ఆధారాలు పోలీసులకు అందజేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి అంతకంతకు ముదురుతున్న ఈ వివాదం ఇప్పటికల్లా సద్దుమణిగే సూచనలు ఏవీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్రా కలిసి నటించిన ‘తిరగబడర సామీ’ మూవీని తాజాగా వాయిదా వేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా కలిసి తాజాగా నటించిన సినిమా ‘తిరగబడర సామీ’. అయితే ఈ మూవీని దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించగా.. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే.. ఈనెల (జూలై)19వ తేదీన రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ, ప్రస్తుతం రాజ్ తరుణ్, మాల్వీ, లావణ్యల మధ్య జరుగుతున్న ఈ వివాదం, కేసుల దెబ్బకు తాజాగా ఈ సినిమాను వాయిదా వేశారు. ఎందుకంటే.. ఈ సమయంలో రాజ్ తరుణ్– మాల్వి మల్హోత్రా ప్రమోషన్స్ కి బయటకి వస్తే అందరూ ఈ వివాదం గురించే ఎక్కువగా అడుగుతారని, కనుక ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ ఇమేజ్ మొత్తం నెగిటివ్ గా ప్రమోట్ అవుతుందని మూవీ మేకర్స్ ఆలోచించారు.

అందుకే ఈ సమయంలో సినిమా రిలీజ్ చేయడం కష్టమని, తిరగబడర సామీ సినిమాను ఆగస్టు 2కు వాయిదా వేశారు. కాగా, మూవీ వాయిదా వేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఇకపోతే తిరగబడర సామీ ఆగస్టు 2కు అయినా రిలీజ్ అవుతుందో లేదో, అప్పటికైనా రాజ్ తరుణ్ పై కేసులు సద్దుమణుగుతాయో లేదో అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా.. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాని రిలీజ్ చేస్తారా అంటూ సందేహ పడుతున్నారు. కానీ, ఏదీ ఏమైనా సినిమా రిలీజ్ సమయానికి రాజ్ తరుణ్ పై ఆరోపణలు, కేసులు అనేవి సినిమాకే కాదు, అతిని కెరీర్ కు కూడా గట్టిగానే ఎఫెక్ట్ పడింది.

ఇదిలా ఉంటే.. మరోవపై రాజ్ తురణ్, మాల్వీ మల్హోత్రా, అతని సోదరుడు మయాంక్ మల్హోత్రాపై పోలీసులు 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, అలాగే అలాగే ఏ1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వీ మల్హోత్రా, ఎ3 గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు ఈ కేసులో చేర్చారని సమాచారం అందింది. మరి, రాజ్ తరుణ్,మాల్వీ మల్హోత్రా నటించిన ‘తిరగబడర సామీ ఆగస్టుకు వాయిదా వేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique