iDreamPost
android-app
ios-app

Nithin : మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేయనున్న యంగ్ హీరో నితిన్ .. ఎక్కడంటే !

  • Published Jun 17, 2024 | 8:58 AM Updated Updated Jun 17, 2024 | 8:58 AM

వెండి తెరపై అందరిని అలరించి.. మంచి నటి నటులుగా పేరొందిన స్టార్ సెలెబ్రిటీలంతా కేవలం సినిమాల మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండరు. వాటితో పాటు ఇతర బిజినెస్ లలోను భాగస్వామ్యం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ దారిలోకి మరొక హీరో ఎంటర్ అయ్యాడు.

వెండి తెరపై అందరిని అలరించి.. మంచి నటి నటులుగా పేరొందిన స్టార్ సెలెబ్రిటీలంతా కేవలం సినిమాల మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండరు. వాటితో పాటు ఇతర బిజినెస్ లలోను భాగస్వామ్యం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ దారిలోకి మరొక హీరో ఎంటర్ అయ్యాడు.

  • Published Jun 17, 2024 | 8:58 AMUpdated Jun 17, 2024 | 8:58 AM
Nithin : మల్టీప్లెక్స్ బిజినెస్  స్టార్ట్ చేయనున్న యంగ్ హీరో నితిన్ .. ఎక్కడంటే !

హీరోల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే వారంతా కేవలం సినిమాల మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎంత కష్టపడినా అనుకోని విధంగా ఒక్కోసారి కొన్ని సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. దీనితో కేవలం సినిమాలనే నమ్ముకోకుండా చాలా మంది.. ఇతర వ్యాపారాలలోను భాగస్వామ్యం అవుతూ ఉంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలను కూడా చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఇదే బాట పట్టాడు.

నిన్న మొన్నటి వరకు చాలా వరకు హీరోయిన్స్ మాత్రమే.. వ్యాపారాల్లోకి అడుగుపెట్టేవారు. కానీ ఇప్పుడు హీరోలు కూడా వ్యాపారరంగంలోకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది హీరోలు చేస్తున్న బిజినెస్ ఏంటంటే.. మల్టిప్లెక్స్ లను ప్రారంభించడం. ఈ బిజినెస్ లో ఇప్పటికే చాలా మంది అగ్ర హీరోలు విజయవంతంగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నితిన్ ఏషియన్‌ సంస్థతో కలిసి ANS సినిమాస్ అనే మల్టిప్లెక్స్ ను స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. దీనితో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆల్రెడీ నితిన్ కు తెలంగాణలోని సంగారెడ్డిలో.. సితార అనే పేరుతో ఓ థియేటర్ ఉంది. ప్రస్తుతం ఈ థియేటర్ ను రేనోవేషన్‌ చేస్తున్నారు. ఇదే థియేటర్ ను మల్టిప్లెక్స్ గా మారుస్తున్నట్లు టాక్ .

ఈ థియేటర్ కు ఏషియన్‌ నితిన్‌ సితార అనే పేరును పెట్టనున్నారట. కాబట్టి సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు.. త్వరలోనే మల్టీప్లెక్స్ రానుంది. ఇప్పటివరకు కేవలం పెద్ద పెద్ద నగరాలైన.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో మాత్రమే మల్టీప్లెక్స్ లు ఉండేవి. కానీ ఇప్పుడు హీరోల కారణంగా చిన్న పట్టణాలకు సైతం మల్టీప్లెక్స్ లు వచ్చేస్తున్నాయి. మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌ లాంటి అగ్ర హీరోలు.. ఈ బిజినెస్ లో సక్సెస్ అయినా సంగతి తెలిసిందే. మరి నితిన్ బిజినెస్ జర్నీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş