iDreamPost
android-app
ios-app

షూటింగ్‌లో గాయపడ్డ నితిన్.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

  • Published Jan 11, 2024 | 8:43 AM Updated Updated Jan 11, 2024 | 8:43 AM

సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ సమయంలో కొన్నిసార్లు ప్రమాదాలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. కొన్నిసార్లు రిస్క్ సీన్లలో హీరోలు రియల్ స్టంట్స్ లో పాల్గొంటారు. ఆ సమయంలో గాయాలు జరుగుతుంటాయి.

సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ సమయంలో కొన్నిసార్లు ప్రమాదాలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. కొన్నిసార్లు రిస్క్ సీన్లలో హీరోలు రియల్ స్టంట్స్ లో పాల్గొంటారు. ఆ సమయంలో గాయాలు జరుగుతుంటాయి.

  • Published Jan 11, 2024 | 8:43 AMUpdated Jan 11, 2024 | 8:43 AM
షూటింగ్‌లో గాయపడ్డ నితిన్.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

ప్రమాదాలు ఏ రూపంలో పొంచి ఉంటాయో ఎవరూ ఊహించలేరు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవొచ్చు. వెండితెరపై మనం హీరో విలన్లను చితకబాదే సీన్లు చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటాం.. కానీ దాని వెనుక ఎంత రిస్క్ ఉంటుందో ఎవరికీ తెలియదు.  యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో హీరోలకు, స్టంట్ మాస్టర్లకు తీవ్రంగా గాయాలు అవుతుంటాయి.. కొన్నిసార్లు ప్రాణా మీదకు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం హీరో నితిన్ ‘తమ్ముడు’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలో నితిన్ కి ప్రమాదం జరిగి గాయాలు అయ్యాయి. వెంటనే షూటింగ్ నిలిపి వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలోకి జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ తర్వాత దిల్ మూవీతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా తన ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు నితిన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో కనిపిస్తుంటాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఏపీలోని మారేడుమిల్లిలో జరుగుతుంది. ఇక్కడ ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది.. నితిన్ కి చేతికి గాయం కావడంతో వెంటనే షూటింగ్ నిలిపివేశారు. వైద్యులు వచ్చి పరీక్షించి చికిత్స చేశారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. షూటింగ్ లో నితిన్ కి గాయాలు అయిన విషయం తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం నితిన్ బాగానే ఉన్నారని.. రెస్ట్ తీసుకుంటున్నారని చిత్ర బృందం తెలిపింది.

hero nithin

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘తమ్ముడు’ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పవన్ కి వీరాభిమాని అయిన నితిన్ ఇప్పుడు ఇదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నితిన్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నితిన్ ‘తమ్ముడు’ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు వేణు శ్రీరామ్ కూడా ఇదే సినిమాతో మంచి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet