iDreamPost
android-app
ios-app

‘ఆయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్! గెస్ట్ గా బావ కాదు.. మరో స్టార్!

  • Published Aug 13, 2024 | 6:29 PM Updated Updated Aug 14, 2024 | 8:19 AM

AAY Movie Pre Release Special Guest : జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన 'ఆయ్' మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ కాకుండా మరొక స్టార్ హీరో గెస్ట్ గా రానున్నారట.

AAY Movie Pre Release Special Guest : జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన 'ఆయ్' మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ కాకుండా మరొక స్టార్ హీరో గెస్ట్ గా రానున్నారట.

  • Published Aug 13, 2024 | 6:29 PMUpdated Aug 14, 2024 | 8:19 AM
‘ఆయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్! గెస్ట్ గా బావ కాదు.. మరో  స్టార్!

‘మ్యాడ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఫస్ట్ సినిమాతోనే యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాంతో ఆ రేంజ్ లో హిట్టు కొట్టాలని ఆచి తూచి సినిమా కథలని ఎంచుకుంటున్నాడు నార్నె నితిన్. ప్రస్తుతం ‘ఆయ్’ సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. పెద్ద సినిమాల నడుమ మంచి అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. GA 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించగా అంజి కె మణిపుత్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సినిమాని సక్సెఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కచ్చితంగా కంటెంట్ పరంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. పైగా ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో కూడా మేకర్స్ చాలా యాక్టీవ్ గా ఉన్నారు. అందుకే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని మంగళవారం హైదరాబాద్‌లోని దాస్పల్లా హోటల్‌లో సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌కి నిఖిల్ తో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

aay pre release event

 

నార్నె నితిన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఆయ్’ మూవీని మేకర్స్ చాలా బాగా తెరకెక్కించారని తెలుస్తుంది. చక్కటి కంటెంట్ తో పూర్తిగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలోని కామెడీ, ఎమోషన్స్ ఆడియెన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో గోదావరి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు ఏవి అంతగా అంచనాలను అందుకోలేకపోయాయి. ఒకవేళ ‘ఆయ్’ గనుక ఆ ఫీల్ ని క్రియేట్ చేయగలిగితే… బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ జరగడం పక్కా! చూడాలి మరి.. మ్యాడ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నార్నె నితిన్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో. మరి.. తారక్ కాకూండా.. నిఖిల్ ఈ మూవీకి చీఫ్ గెస్ట్ గా రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet