iDreamPost
android-app
ios-app

Nikhil Siddhartha: ప్రభాస్ ఫ్యాన్స్‌కు హీరో నిఖిల్ గుడ్ న్యూస్.. 100 మందికి ఆఫర్

  • Published Dec 16, 2023 | 5:12 PM Updated Updated Dec 16, 2023 | 5:12 PM

డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది డార్లింగ్ ప్రభాస్ మూవీ సలార్ ది సీజ్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ మరికొన్ని గంటల్లో ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి తొలి టికెట్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు.. హీరో నిఖిల్ కూడా...

డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది డార్లింగ్ ప్రభాస్ మూవీ సలార్ ది సీజ్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ మరికొన్ని గంటల్లో ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి తొలి టికెట్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు.. హీరో నిఖిల్ కూడా...

  • Published Dec 16, 2023 | 5:12 PMUpdated Dec 16, 2023 | 5:12 PM
Nikhil Siddhartha: ప్రభాస్ ఫ్యాన్స్‌కు హీరో నిఖిల్ గుడ్ న్యూస్.. 100 మందికి ఆఫర్

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సలార్-ది సీజ్ ఫైర్ డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే..హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ బుకింగ్స్ స్టార్ కానున్నాయి. ఈ మూవీ కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఎదురు చూస్తున్నారు అనుకుంటే పొరపాటు. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బీటౌన్, ఇటు శాండిల్ వుడ్ ఇండస్ట్రీలోని నటీనటులు, సినీ పెద్దలు, మీడియా ప్రముఖులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఎప్పుడెప్పుడూ చూద్దామా అనే ఉత్సుకతో ఉన్నారు. తొలి టికెట్ దర్శక ధీరుడు రాజమౌళి  కొనుగోలు చేసిన సంగతి విదితమే.

కాగా, టాలీవుడ్ యంగ్ నటుడు సిద్దార్ద్ కూడా టికెట్ కొనేశారు.  మూవీకి విడుదల రోజే వెళ్లనున్నారు. డిసెంబర్ 22 రాత్రి ఒంటి గంటలకు స్పెషల్ షోకి ఆయనకు టికెట్ కన్ఫమ్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. శ్రీరాములు థియేటరల్లో 22వ తేదీ తెల్లవారు జామున 1గంటకు షో ఫిక్స్ అని పేర్కొన్నారు. దీంతో అన్న మాకు కూడా టికెట్లు ఇవ్వకూడదే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా సిద్దార్థ్‌కు రిక్వెస్టులు పెడుతున్నారు. దీంతో ఆయన ఓ భారీ ఆఫర్ ప్రకటించాడు.. శ్రీరాములు థియేటర్‍లో ఆయనతో కలిసి సినిమా చూసే అవకాశాన్ని ఇచ్చారు. దీని కోసం ఆయన 100 టికెట్లను ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

‘శ్రీరాములు థియేటర్‍లో నాతో కలిసి సలార్ మూవీ సినిమా చూసేందుకు 100 మంది టికెట్లను ఉచితంగా ఇస్తున్నా. ముఖ్యంగా ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌కు. పదేళ్ల క్రితం ఇదే సినిమా థియేటర్‌లో మిర్చి సినిమాను అదే ఒంటి గంట స్పెషల్ షోకు వెళ్లి చూశాను. దీన్ని బట్టి చరిత్ర పునరావృతం కాబోతోంది’అంటూ ట్వీట్ చేశాడు సిద్దార్థ్. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ టికెట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభాస్‌కు ఇండస్ట్రీలో హీరోలందరూ ఫ్రెండ్స్ అన్న సంగతి విదితమే. వారిలో ఒకరు నిఖిల్ కూడా. ఇప్పుడు అతడు ఈ మూవీ టికెట్ కొనడమే కాకుండా..డార్లింగ్ ఫ్యాన్స్‌కు భారీ ఆఫర్ ఇచ్చి.. తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరెందుకు ఆలస్యం సిద్దార్థ్‌కు రిక్వెస్టులు పెట్టండిక. ఈ భారీ ఆఫర్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş