iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నోడిని గుర్తుపట్టారా.. అమ్మాయిల బిగ్ క్రష్ ఇతను

  • Published Jul 31, 2024 | 4:10 AM Updated Updated Jul 31, 2024 | 4:10 AM

పై ఫోటోలో తాతతో ఎంతో క్యూట్ గా, అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిలు అందరికీ ఈ హీరో అంటే క్రష్. ఇంతకీ ఎవరో గుర్తపట్టారా..?

పై ఫోటోలో తాతతో ఎంతో క్యూట్ గా, అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిలు అందరికీ ఈ హీరో అంటే క్రష్. ఇంతకీ ఎవరో గుర్తపట్టారా..?

  • Published Jul 31, 2024 | 4:10 AMUpdated Jul 31, 2024 | 4:10 AM
ఈ ఫోటోలో చిన్నోడిని గుర్తుపట్టారా.. అమ్మాయిల బిగ్ క్రష్ ఇతను

ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న చాలామంది సెలబ్రిటీస్ మొదట చిన్న స్థాయి నుంచి కెరీర్ మొదలుపెట్టిన వారే ఎక్కువగా ఉన్నారు. పైగా ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా..కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగి నేడు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో ఇలా స్వతగా ఐడెంటిపై తెచ్చుకున్న వారు మొదట తమ కెరీర్ ను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, అసిస్టెంట్ డైరెక్టర్స్ గా మొదలు పెట్టి, ఆపై నటన మీద ఆసక్తితో వెండితెరపై అడుగులు వేసినవారు ఉన్నారు. మరీ, అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ స్టార్ హీరో కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో తాతతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ చిన్నోడు స్టార్ హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఈయనకంటూ ప్రత్యేకంగా ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో తాతతో ఎంతో క్యూట్ గా, అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిలు అందరికీ ఈ హీరో అంటే క్రష్. ఇంతకీ ఎవరో గుర్తపట్టారా.. మరీ, ఆ చిన్నోడు ఎవరో కాదు.. టాలీవుడ్ నేచురల్ స్టార్ ‘నాని’. ఈ  పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. చూడటానికి పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈయన మొదటిగా టీవీ వ్యాఖ్యతగా పని చేసి, ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశాడు. అలా కొన్నాళ్లు పనిచేసిన నానికి నటనపై ఆసక్తితో వెండితెరపై నటించాలనే ఆసక్తి కలిగింది.

ఈ క్రమంలోనే నాని మొదటిగా ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే తొలి సినిమాతోనే తన నేచురల్ నటనతో మంచి మార్కులు వేసుకున్న ఈ హీరోకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా.. వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఇలా అతి తక్కువ కాలంలోనే ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. అంతేకాకుండా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు. అయితే నాని నటించిన సినిమాల్లో ఈగ, నేను లోకల్, వీ, నిన్ను కోరి, దసరా, శ్యాం సింగరాయ్ వంటి సినిమాలు నానికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.

అయితే ఇటీవలే హాయ్ నాన్నతో మరోసారి మంచి నాని మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే నాని ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఈ హీరో తన స్నేహితురాలు అంజనను 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా, వీరిద్దరికి ఓ కొడుకు ఉన్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం నానికి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలో నాని తన తాతతో కలిసి ఉన్నాడు. అయితే ఈ ఫోటోలో నాని ఎంతో అమాయకంగా, క్యూట్ గా ఉన్నాడు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాని చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş