iDreamPost
android-app
ios-app

రెమ్యూనరేషన్‌ వద్దంటున్న హీరో.. కారణం తెలిస్తే శభాష్‌ అంటారు!

షార్ట్‌ ఫిల్మ్స్‌తో సత్తా చాటి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరో కిరణ్‌ అబ్బవరం. ఇండస్ట్రీలో క్రేజీ కుర్ర హీరోగా సంవత్సరానికి రెండు,మూడు సినిమాలు చేస్తూ బిజీబీజీగా గడుపుతున్నారు..

షార్ట్‌ ఫిల్మ్స్‌తో సత్తా చాటి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరో కిరణ్‌ అబ్బవరం. ఇండస్ట్రీలో క్రేజీ కుర్ర హీరోగా సంవత్సరానికి రెండు,మూడు సినిమాలు చేస్తూ బిజీబీజీగా గడుపుతున్నారు..

రెమ్యూనరేషన్‌ వద్దంటున్న హీరో.. కారణం తెలిస్తే శభాష్‌ అంటారు!

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా.. స్వయం కృషితో హీరోగా రాణిస్తున్నారు కిరణ్‌ అబ్బవరం. ఏడాదికి మినిమమ్‌ రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. హిట్టు, ప్లాపులతో ఎలాంటి సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తాజాగా, రూల్స్‌ రంజన్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్‌ 6వ తేదీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

అయితే, కిరణ్‌ అబ్బవరం ఇప్పటి వరకు 8 సినిమాల్లో నటించారు. వీటిలో ఎక్కువ శాతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో కిరణ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సినిమా కథల గురించి సరిగా పట్టించుకోకుండా.. డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నారంటూ నెటిజన్లు ట్రోలింగ్స్‌ చేయటం మొదలుపెట్టారు. తాజాగా, ఈ కామెంట్లపై ఆయన స్పందించారు. ‘‘ నేను నా సినిమాలకు రెమ్యూనరేషన్‌ తీసుకోను.  దానికి బదులు కేవలం లాభాల్లో శాతం మాత్రమే తీసుకుంటాను.

ఒక వేళ నా నిర్మాతలు నష్టపోతే.. నేను ఆ సినిమాకు డబ్బులు తీసుకోను. నేను నిర్మాతను అయి ఉంటే.. మీటర్‌, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలను నిర్మించే వాడిని కాదు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కిరణ్‌ మంచి తనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మిగిలిన హీరోలు కూడా ఇలానే చేస్తే నిర్మాతలు అసలు నష్టపోరని అంటున్నారు. కిరణ్‌ ఇతర హీరోలకు ఈ విషయంలో రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, కిరణ్‌ అబ్బవరం సినిమాల్లోకి రావటానికి ముందు షార్ట్‌ఫిల్మ్స్‌ చేశారు. 2015నుంచి షార్ట్‌ఫిల్మ్స్‌ చేస్తున్నారు. గచ్చిబౌలి ఆయన మొదటి షార్ట్‌ఫిల్మ్‌. ఆయన తీసిన శ్రీకారం అనే షార్ట్‌ ఫిల్మ్‌ సినిమాగా కూడా తెరకెక్కింది. ఈ సినిమాలో శర్వానంద్‌-ప్రియాంక అరుల్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో వచ్చిన ‘రాజా వారు రాణీ వారు’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఆయన రెండు షార్టు ఫిల్మ్‌లు చేశారు.

2017లో ఆయన తీసిన ‘అందరూ అందగత్తెలే’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కూడా సినిమాగా తెరకెక్కింది. సమ్మతమే అనే పేరుతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్‌ 2021లో వచ్చిన ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లోనే మైలు సినిమాగా నిలిచిపోయింది. 2023లో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరి, కిరణ్‌ అబ్బవరం తన సినిమాలుకు రెమ్యూనరేషన్‌ తీసుకోకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.