iDreamPost
android-app
ios-app

సొంత డైరెక్షన్‌తో సినిమాని ఫ్లాప్ చేసుకున్న 5 మంది హీరోలు!

కొంత మంది హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు తెరకెక్కించారు. హీరోలు తమను తాము డైరెక్ట్ చేసుకోవడం ఇప్పుడేమీ కొత్తకాదు. ఎప్పటి నుండో వస్తుంది. సొంత దర్శకత్వంలో మూవీస్ తెరకెక్కించి.. ప్లాప్స్ అందుకున్న హీరోలను పరిశీలిస్తే..

కొంత మంది హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు తెరకెక్కించారు. హీరోలు తమను తాము డైరెక్ట్ చేసుకోవడం ఇప్పుడేమీ కొత్తకాదు. ఎప్పటి నుండో వస్తుంది. సొంత దర్శకత్వంలో మూవీస్ తెరకెక్కించి.. ప్లాప్స్ అందుకున్న హీరోలను పరిశీలిస్తే..

సొంత డైరెక్షన్‌తో సినిమాని ఫ్లాప్ చేసుకున్న 5 మంది హీరోలు!

హీరోలుగా కొన్ని సినిమాలు చేశాక ఆ ఎక్స్ పీరియన్స్‌తో కొంత మంది మెగా ఫోన్ పట్టుకుంటారు. తమ సినిమాలను తామే డైరెక్ట్ చేసుకుంటారు. ఇది ఇప్పుడు నుండి వస్తున్న ట్రెండ్ కాదు. లెజండరీ హీరో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు కాలం నుండే ఈ పరంపర కొనసాగుతుంది. ఆయన దాదాపుగా 10 సినిమాలు డైరెక్షన్ చేశాడు. అందులో తనే హీరో. అయితే దర్శకత్వం వహించిన సినిమాలన్నీ హిట్లు కాలేదు.. అలా అన్ని మెప్పించలేదు అని కూడా చెప్పలేం. ఇలా చాలా మంది హీరోలు డైరెక్టర్లుగా మారి మెగా ఫోన్ చేతబట్టి సినిమాలు తెరకెక్కించారు. అయితే వీరిలో కొంత మంది ప్లాప్స్ అందుకున్నారు. మరికొంత మందికి మిశ్రమ టాక్ వచ్చింది. వారెవరూ, ఏ సినిమాలు తీశారూ ప్రస్తావించుకుంటే

వరుస హిట్లతో దూసుకెళుతున్న యంగ్ టాలెంట్ అడవి శేష్. అందరికీ క్షణం మూవీతో రిజిస్టర్ అయిన శేష్.. తనే హీరోగా పరిచయం అవుతూ.. దర్శకత్వం వహించిన మూవీ కర్మ. డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో ఆ తర్వాత అటుగా ప్రయత్నాలు చేయలేదు. అయితే రాబోయే చిత్రం డకాయిట్ మూవీకి రైటర్ అవతారం ఎత్తాడు. అలాగే మరో వర్సటైల్ నటుడు విజయ్ ఆంటోనీ కూడా ఆకట్టుకోలేకపోయాడు. సలీమ్, సైతాన్, బిచ్చగాడుతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సొంత మార్క్‌ను ఏర్పాటు చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కమ్, ప్లే బ్యాక్ సింగ్ కమ్ దర్శకుడు.. బిచ్చగాడు 2ను తెరకెక్కించాడు. బిచ్చగాడుతో పోలిస్తే దాని సీక్వెల్ అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఏకైక మూవీ జానీ. పవన్, మాజీ భార్య రేణు దేశాయ్ నటించిన ఈ మూవీ 2003లో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి కథ ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ, ఎమోషనల్ స్టోరీ అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో తడబడింది. దీంతో మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టలేదు ఈ పవర్ స్టార్. ఇక ప్రముఖ రైటర్ పోసాని కృష్ష మురళి.. కేవలం రైటర్ కాదు ప్రొడ్యూసర్, డై రెక్టర్ కూడా. తాను హీరోగా మెంటల్ కృష్ణ ఓకే కానీ.. ఆ తర్వాత వచ్చిన రాజా వారి చేపల చెరువు ప్లాప్‌గా నిలిచింది. ఇక ధనుష్ కూడా దర్శకుడు అన్న సంగతి విదితమే. తాజాగా తానే హీరోగా రాయన్ అనే మూవీని తెరకెక్కించాడు. టాక్ బాగున్నప్పటికీ.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల విషయంలో చతికిలబడింది. వీరే కాదు కన్నడ నటుడు ఉపేంద్ర కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాడు. వాటిల్లో ఒకటి రెండు చిత్రాలు ఎట్రాక్ట్ చేయలేకపోయాయి. అలాగే కమల్ హాసన్ కూడా దర్శకుడే.. ఆయన సినిమాలు కొన్ని మెప్పించలేకపోయాయి.