Krishna Kowshik
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్టై.. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యింది. కాగా, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఆమె సభ్యత్వం రద్దు చేయగా. . ఇప్పుడు ‘మా’కు సంచలన లేఖ రాసింది. ఇంతకు అందులో ఏం రాసిందటే..?
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్టై.. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యింది. కాగా, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఆమె సభ్యత్వం రద్దు చేయగా. . ఇప్పుడు ‘మా’కు సంచలన లేఖ రాసింది. ఇంతకు అందులో ఏం రాసిందటే..?
Krishna Kowshik
బెంగళూరులో పుట్టిన రోజు వేడుకల ముసుగులో రేవ్ పార్టీ నిర్వహించగా.. స్థానిక పోలీసులు రైడ్ చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఒకరు. పార్టీలో పట్టుకున్న వారందరీ దగ్గర నుండి డ్రగ్స్ శాంపిల్స్ సేకరించి వదిలిపెట్టారు. ఈ క్రమంలో 86 మందికి పాజిటివ్ అని వచ్చింది. ఇదిలా ఉంటే తొలుత ఈ పార్టీలో తాను పాల్గొనలేదని హేమ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొంది అంటూ ఫోటోలో రిలీజ్ చేశారు. వీడియో షూట్ చేసిన ప్రదేశానికి సంబంధించిన వీడియోలు పెట్టారు. ఇదిలా ఉంటే.. పార్టీలో పాల్గొన్న వారందరకీ బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.హేమకు కూడా నోటీసులు అందాయి.
హేమ జ్వరం పేరుతో దర్యాప్తుకు రెండు సార్లు స్కిప్ చేయగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టు చేశారు. ఆమెకు మెడికల్ పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగిశాక ఆమెకు బెయిల్ రావడంతో.. జూన్ 14న బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కేసులో అరెస్టైన నేపథ్యంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సభ్యత్వం రద్దు చేసింది. ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చిన హేమ… ‘మా’కు సంచనల లేఖ రాసింది. మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి స్వయంగా ఆ లెటర్ అందజేసింది. దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్‌కు సంబంధించిన తాజా రిపోర్టును కూడా అందజేసింది. ఇంతకు ఆ లేఖలో ఏముందంటే..?
‘నేను సుమారు దశాబ్ద కాలంగా మా అసోసియేషన్‌లో సభ్యురాలిగా ఉన్నాను. అలాంటిది నాకు ఎటువంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, కనీసం వివరణ అడగకుంగా మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నాపై దుష్ప్రచారం జరిగింది. ఈ విషయంలో మా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది. ‘మా’ బైలాస్ ప్రకారం నాకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేయాలి. నేను ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు నాపై యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా మా సభ్యత్వం తీసేయడం సరైన చర్య కాదు. ఇది నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటనలో నన్ను తప్పుగా మీడియా పోట్రేట్ చేసింది. ఇటీవల నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాకు నెగిటివ్ వచ్చింది. త్వరలోనే బెంగళూరు పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయి. మళ్లీ ‘మా’లో నా సభ్యత్వాన్ని కొనసాగించాలి. ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు ‘మా’ సపోర్ట్ కావాలి’ అని లేఖలో పేర్కొంది హేమ. కాగా హేమ లేఖను తీసుకున్న మంచు విష్ణు దాన్ని అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, అప్పుడు ఓ నిర్ణయం తీసుకుంటామని ఆమెకు హామీనిచ్చినట్లు సమాచారం.