iDreamPost
android-app
ios-app

కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా ‘మా’కు మంచు విష్ణు 10 లక్షల విరాళం!

  • Published Aug 10, 2024 | 7:57 PM Updated Updated Aug 10, 2024 | 7:57 PM

On The Occasion Of His Daughters Birthday Manchu Vishnu Donated 10 lakhs To MAA: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు మరోసారి తన మంచి మనుసును చాటుకున్నారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 'మా'కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

On The Occasion Of His Daughters Birthday Manchu Vishnu Donated 10 lakhs To MAA: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు మరోసారి తన మంచి మనుసును చాటుకున్నారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 'మా'కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

  • Published Aug 10, 2024 | 7:57 PMUpdated Aug 10, 2024 | 7:57 PM
కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా ‘మా’కు మంచు విష్ణు 10 లక్షల విరాళం!

మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించి విడుదల చేయబోతున్నారు. కన్నప్ప వంటి భారీ బడ్జెట్ చిత్రంతో ఆర్టిస్టులకు ఉపాధి కల్పించడమే కాకుండా.. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా మంచు విష్ణు ఆర్టిస్టుల బాగోగులు చూసుకుంటున్నారు. తాజాగా ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా భారీ విరాళం ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ నగదు మొత్తాన్ని కళాకారులకు అవసరమైన సహాయం చేయడం, ఆర్టిస్టులకు అవసరమైన సపోర్ట్ అందించడం, వారికి సరైన సంరక్షణ అందేలా చూడటం కోసం ఖర్చు చేయనున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గడిచిన మూడేళ్లలో మంచు విష్ణు అధ్యక్షతన అద్భుతమైన అభివృద్ధి సాధించింది అంటూ అసోసియేషన్ మెంబర్స్ ప్రశంసిస్తున్నారు. ‘మా’ భవనంపై కూడా మంచు విష్ణు ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆర్టిస్టుల వ్యక్తిగత, సోషల్ లైఫ్ భద్రతకి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి విష ప్రచారం చేసే యూట్యూబ్ ఛానల్స్ పై ఉక్కుపాదం మోపారు. మా అసోసియేషన్ మెంబర్స్, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్ ‌ను కట్టడి చేసేందుకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నడుంబిగించారు.

ఆర్టిస్టులపై వచ్చే అసత్య ప్రచారాలు, విషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను తొలగించడంలో విష్ణు కీలక పాత్ర పోషించారు. మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాత్మక చర్యపై ఇండస్ట్రీ పెద్దలు, టాలీవుడ్ ఆర్టిస్టులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే విష్ణు తీసుకున్న చర్యలను ఇతర ఇండస్ట్రీ కళాకారులు కూడా ప్రశంసించారు. ఇంక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మంచు విష్ణు ఫోకస్ మొత్తం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్ పైనే ఉంది. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş