Keerthi
ఇటీవల కాలంలో ఏఐ ఆధారంగా రూపొందించిన సెలబ్రిటీస్ డీప్ ఫేక్ వీడియోలు సినీ ఇండస్ట్రీలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇందులో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందన పై వచ్చిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ చర్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇంతకి అతను ఎవరంటే..
ఇటీవల కాలంలో ఏఐ ఆధారంగా రూపొందించిన సెలబ్రిటీస్ డీప్ ఫేక్ వీడియోలు సినీ ఇండస్ట్రీలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇందులో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందన పై వచ్చిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ చర్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇంతకి అతను ఎవరంటే..
Keerthi
ప్రస్తుత కాలంలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)టెక్నలజీ అనేది ప్రపంచాన్ని శాసిస్తోన్న విషయం తెలిసిందే. దీని వలన ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న సెలబ్రిటీస్ డీప్ ఫేక్ వీడియోలు సినీ ఇండస్ట్రీలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే గతేడాది నేషనల్ క్రష్ రష్మిక మందన పై వచ్చిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏఐ ఆధారంగా తయారుచేసిన ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా ఈ చర్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం ప్రత్యేకంగా చెప్పలసిన అవసరం లేదు. ఈ వీడియోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి రూపొందించారు. జరా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒరిజినల్ వీడియో క్లిప్‌లో టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ముఖాన్ని జోడించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలామంది సినీ ప్రముఖులు ఖండించారు. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ వీడియో పై స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని, ఈ చర్యకు పాల్పడిన వారిపై కచ్చితంగా చట్టపరమైన శిక్ష విధిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే రష్మిక ఫేక్ వీడియోకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నవంబర్ 10వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదుకాగా, ఈ కేసు బాధ్యతను ఐఎఫ్‌ఎస్‌ఓ బృందానికి అప్పగించారు. ఈ విచారణ అనంతరం డీప్ ఫేక్ వీడియో నిందుతుడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఇమాని నవీన్‌గా గుర్తించారు.
పోలీసుల కస్టడికి వచ్చిన తర్వాత నవీన్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఇతను సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికే రష్మిక ఫ్యాన్‌పేజీతో పాటు మరి కొందరు సెలబ్రిటీల ఫ్యాన్స్ పేజీలను నిర్వహిస్తున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే.. నవీన్ ఇలా ఫేక్ వీడియోను రూపొందించాడని డిసీపీ హేమంత్ తివారీ తెలిపారు. రష్మిక ఫేక్ వీడియో అప్‌లోడ్ తర్వాత ఫాలోవర్ల సంఖ్య 90 వేల నుంచి 1 లక్ష 8 వేలకు పెరిగిందని నిందితుడు తెలిపాడు. అయితే ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచనలనంగా మారడంతో భయపడ్డ నవీన్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించాడంతో పాటు అకౌంట్ పేరును కూడా మార్చేశాడు.
కాగా, మొదట ఐఎఫ్‌ఎస్‌ఓ బృందం విచారణలో భాగంగా 500కిపైగా సోషల్ మీడియా అకౌంట్‌లను స్కాన్ చేశారు. సైబర్ ల్యాబ్‌లో వీడియోను విశ్లేషించారు. విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా వందల మంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండ్లర్‌లను విచారించింది. విచారణ అనంతరం చివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో నిందితుడి అకౌంట్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు నవీన్ నేపథ్యం విషయానికొస్తే.. అతడిది ఏపీలోని గుంటూరు జిల్లా పాలపారు గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఇక నవీన్ చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసిన అనంతరం 2019లో గూగుల్ నుంచి డిజిటల్ మార్కెటింగలో సర్టిఫికేషన్ చేశాడు. అలాగే వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, ఫొటోషాప్, ఇన్‌స్టాగ్రామ్ చానెల్ ప్రమోషన్ ప్రారంభించి వీడియోలను రూపొందించి అప్‌లోడ్ చేసేవాడు. దీనితో పాటు కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాండిల్ చేశాడు. ఇంతటి ఘనత ఉన్న ఇతను యూటయూబ్‌లో డీప్ ఫేక్ వీడియోలు ఎలా చేయాలో నేర్చుకుని ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు. మరి, ఈ వీడియోను రూపొందించిన నిందుడిని పోలీసులు గుర్తించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.