iDreamPost
android-app
ios-app

శ్రీలీల రేర్ వీడియో చూశారా..? క్లాసికల్ డ్యాన్సును అదరగొట్టింది

  • Published Feb 10, 2024 | 2:01 PM Updated Updated Feb 10, 2024 | 2:01 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపను చూశారా కదా.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కుర్ర హీరోలు కూడా ఆమెతో కాలు కదపాలంటే ముందుగానే ప్రిపేర్ కావాల్సిందే. ఇప్పుడు ఆ బ్యూటీ రేర్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపను చూశారా కదా.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కుర్ర హీరోలు కూడా ఆమెతో కాలు కదపాలంటే ముందుగానే ప్రిపేర్ కావాల్సిందే. ఇప్పుడు ఆ బ్యూటీ రేర్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

  • Published Feb 10, 2024 | 2:01 PMUpdated Feb 10, 2024 | 2:01 PM
శ్రీలీల రేర్ వీడియో చూశారా..? క్లాసికల్ డ్యాన్సును అదరగొట్టింది

ఇండస్ట్రీలో ఇప్పుడున్న ముద్దు గుమ్మల్లో కేవలం నటనే కాదూ.. వారిలో అంతకు మించిన ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. స్కూల్, కాలేజీ డేస్‌లో చదువుల్లో ముందు వరుసలో నిలవడమే కాదూ అల్లరి చేయడంలో క్లాస్ ఫస్ట్ వచ్చిన హీరోయిన్లు ఉన్నారు. అలాగే ఆట పాటల్లోనూ మేటిగా రాణించిన వారున్నారు. క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్సులను నేర్చుకుని ఫెర్మామెన్స్ ఇచ్చిన వారుంటారు. చిన్నప్పటి నుండే సేవాతత్పర కనబరుస్తూ.. ఆర్థిక సాయం అందించిన నటీమణులున్నారు. ఇవన్నీ ఎప్పుడో ఇంటర్వ్యూస్ సందర్భంగా వాళ్లు బయటపెడితే కానీ తెలియదు మన హీరోయిన్లలోని ఈ మెస్మరైజ్ టాలెంట్స్. వాళ్లు స్టార్ హీరోయిన్ అయ్యాక.. ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంటాయి.

ఇదిగో అలాంటి వీడియోనే ఇది. ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఉంది గుర్తు పట్టారా..? ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. సూపర్ స్టెప్పులతో కుర్ర హీరోలకు కూడా వణుకుపుట్టిస్తోన్న డ్యాన్స్ క్వీన్ అరుదైన వీడియో ఇది. ఆమె భరత నాట్యం కళాకారిణి. చిన్నప్పటి నుండే క్లాసికల్ డ్యాన్సులో ప్రావీణ్యం పొందింది ఈ తెలుగు అమ్మాయి. ఆమె అరంగేట్రానికి సంబంధించినదే ఈ వీడియో. అందులో సుమారు రెండు గంటల పైగానే ప్రదర్శన ఇచ్చింది. ఈ అరంగేట్రం కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తోంది. నాగిని డ్యాన్స్ కూడా ఫెర్ఫ్మామ్ చేసింది శ్రీలీల. అద్బుతమైన నాట్య ప్రదర్శనతో మంత్ర ముగ్దులను చేసేస్తోంది.

ఈ అరంగేట్రానికి టీడీపీ సీనియర్ నేత నన్నప నేని రాజకుమారి, ప్రముఖ నటి జయంతి కూడా హాజరయ్యారు. పేరుకు అచ్చమైన తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. కర్ణాటక, అమెరికాలోనే ఆమె జీవితం సాగింది. ఇప్పటికి ఆమెకు యుఎస్ సిటిజన్ షిప్ ఉంది. అయినప్పటికీ మూలాలు మర్చిపోకుండా భరత నాట్యంలో ప్రావీణ్యురాలు అయ్యింది. ఇప్పుడు అందుకే అంత ఈజీగా స్టెప్పులేసేస్తుందేమో అనిపించకమానదు. అంతేనా ఆమె డాక్టర్ చదువుతూనే యాక్టింగ్ చేస్తుంది. పెళ్లి సందD మూవీతో తెలుగు నాట అడుగు పెట్టిన అమ్మడు.. ధమాకా సినిమాతోనే ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో వరుసు సినిమాలు క్యూ కట్టాయి.

గత ఏడాది స్కంద, భగవత్ కేసరీ, ఆది కేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీలతో అలరించింది. ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అమ్మడు. ప్రస్తుతం పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు పలు ప్రాజెక్టులు చేస్తోంది.  అయితే ఎంబీబీఎస్ చదువుతుండటంతో ప్రస్తుతం కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోవడం లేదు. అలాగే విజయ్ దేవర కొండ మూవీ నుండి కూడా తప్పుకుందని తెలుస్తోంది. మరీ శ్రీలీల చిన్నప్పటి ఈ వీడియో ఎలా ఉందో చూసి.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


Jojobet GirişjojobetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş