iDreamPost
android-app
ios-app

మంచు లక్ష్మిని ఇలా ఎప్పుడైనా చూశారా..? నిజంగా ఆమె అంటే నమ్మలేరు

  • Published Feb 10, 2024 | 6:37 PM Updated Updated Feb 10, 2024 | 6:37 PM

మంచు మోహన్ బాబు నుండి వారసత్వాన్ని తీసుకుని.. నటనలో రాణిిస్తున్నారు ఆయన పిల్లలు. మంచు లక్ష్మి ప్రసన్న, మంచు విష్ణు, మనోజ్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడని కూడా తెలుసు.. మరీ..

మంచు మోహన్ బాబు నుండి వారసత్వాన్ని తీసుకుని.. నటనలో రాణిిస్తున్నారు ఆయన పిల్లలు. మంచు లక్ష్మి ప్రసన్న, మంచు విష్ణు, మనోజ్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడని కూడా తెలుసు.. మరీ..

  • Published Feb 10, 2024 | 6:37 PMUpdated Feb 10, 2024 | 6:37 PM
మంచు లక్ష్మిని ఇలా ఎప్పుడైనా చూశారా..? నిజంగా ఆమె అంటే నమ్మలేరు

సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు. భక్త వత్సల నాయుడు మోహన్ బాబుగా సినీ పరిశ్రమలోకి ఎంటరై.. హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోగా ఎదిగారు. ఎంతో మంది దిగ్గజ దర్శకులతో పని చేసిన ఆయన విభిన్న పాత్రలను పోషించి..విలక్షణ నటుడిగా ముద్ర పడ్డారు. సుమారు 500లకు పైగా పాత్రలు పోషించారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌పై ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. కళామతల్లికి సేవలు చేసినందుకు ఆయన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మంచు మోహన్ బాబు వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన పిల్లలు మంచు లక్ష్మి ప్రసన్న, విష్ణు, మనోజ్.

ఈ ముగ్గురు ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. విష్ణు ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ మూవీ కన్నప్పతో బిజీగా ఉన్నారు. మనోజ్ కొత్తగా ఓటీటీలో ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిలో కాస్త డిఫరెంట్.. మల్టీటాలెండెట్ మంచు లక్ష్మి. నటి, నిర్మాత, యాంకర్, యూట్యూబర్.. వాట్ నాట్. ఎంటర్ టైన్‌మెంట్ రంగంలో ఎందులోనైనా సత్తా చాటగలనని నిరూపించుకుంది మోహన్ బాబు గారాల పట్టి. టాలీవుడ్ రాక ముందే ఆమె హాలీవుడ్ యాక్ట్రెస్. ఆమె పలు ఇంగ్లీషు సినిమాల్లో నటించింది. అప్పట్లో ‘మా అమ్మాయి అంటే మా తెలుగమ్మాయి అంటూ’ ఆకాశానికి ఎత్తేశారు. అనంతరం తన సేవలు ఇండియా అంటూ తెలుగు ఇండస్ట్రీలోకి విలనీగా ఎంట్రీ ఇచ్చారు లక్ష్మి. అక్కడి నుండి ఆమె పరంపర కొనసాగుతూనే ఉంది.

అయితే మంచు లక్షి ప్రసన్న చైల్డ్ ఆర్టిస్టుగా ఓ మూవీ చేసిందని తెలుసా..? బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అందులో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఇంతకు ఆమె ఏ మూవీలో నటించిందంటే.. పద్మ వ్యూహం. మోహన్ బాబు, ప్రభ, ముత్యాల అరుణ, చంద్రమోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. రియల్ తండ్రికీ, రీల్ కూతురిగా నటించింది మన మంచు అక్క. ముత్యాల అరుణ చిన్నప్పటి పాత్రలో కనిపిస్తుంది. ఈ వీడియోలో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నది లక్ష్మి ప్రసన్ననే. ఈ సినిమా కూడా లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో తెరకెక్కినదే. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతుంది. తొలుత మన లక్ష్మియేనా అనిపించకమానదు. కానీ.. కాస్త గమనిస్తే తెలిసిపోతుంది. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా (చైల్డ్ ఆర్టిస్టుగా).

చదువు నిమిత్తం అమెరికా వెళ్లిన లక్ష్మి.. హాలీవుడ్ చిత్రాల్లో నటించి.. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దొంగల ముఠా, ఊ కొడతావా.. ఉలిక్కి పడతావా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, దొంగాట, లక్ష్మి బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, పిట్ట కథలు వంటి చిత్రాలు, వెబ్ సిరీస్‌ల్లో నటించింది.ఇంగ్లీష్, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆది పర్వం అనే మూవీ చేస్తోంది. ఇప్పుడు అటు ముంబయి షిఫ్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే టీచ్ ఫర్ ఛేంజ్ అనే సోషల్ కాజ్‌లో భాగమైంది మంచు లక్ష్మి ప్రసన్న. ఇక్కడకు వచ్చేసింది కానీ.. నిజంగా హాలీవుడ్ లో ఉంటే.. ఓ సూపర్ హీరోయిన్ అయ్యి ఉండేది. ఏమంటారు..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş