iDreamPost
android-app
ios-app

హ్యాపీ డేస్ లో టైసన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటే?

  • Published Aug 07, 2024 | 6:39 PM Updated Updated Aug 07, 2024 | 6:42 PM

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్మల తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో టైసన్ పాత్రలో నటించిన ఈ నటుడు ఎవరికైనా గుర్తున్నడా.. ఇంతకీ ఇతను ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఇందకు ఇండస్ట్రీలో నటుడిగా సక్సేస్ కాలేకపోయాడు? అనే విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్మల తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో టైసన్ పాత్రలో నటించిన ఈ నటుడు ఎవరికైనా గుర్తున్నడా.. ఇంతకీ ఇతను ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఇందకు ఇండస్ట్రీలో నటుడిగా సక్సేస్ కాలేకపోయాడు? అనే విషయాలను తెలుసుకుందాం.

  • Published Aug 07, 2024 | 6:39 PMUpdated Aug 07, 2024 | 6:42 PM
హ్యాపీ డేస్ లో టైసన్  గుర్తున్నాడా? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటే?

యాక్టర్స్ కు సినిమా చిన్నాద, పాత్ర నిడివి తక్కువ అనేది ముఖ్యం కాదు.. సినిమాలో వారు పోషించే పాత్ర ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది, ఏ స్థాయిలో గుర్తుపెట్టుకున్నారు అనేది ముఖ్యం. మరీ, అలా ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యి ఆ సినిమాలో పాత్రతోనే ఆడియాన్స్ గుర్తుపెట్టుకునే యాక్టర్స్ ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.మరీ, అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ నటుడు కూడా ఒకరు. ఆ విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్మల తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో యూత్ మెచ్చేది, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమా ‘హ్యాపీ డేస్’ కూడా ఒకటి. ఈ సినిమా 2007లో విడుదలైన ఈ సినిమా యువతను తెగ ఆకట్టుకుంది.

అయితే అప్పటిలో ఈ సినిమా కొత్త నటీ నటులతో తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు శేఖర్ కమ్మల. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాలో తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్, సోనియా దీప్తి నటించారు. అయితే ఈ సినిమాలో నటించిన వీరందరూ ఆ తర్వాత ఇండస్ట్రీలో నటీ, నటులుగా మంచి సక్సేస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ అనే పాత్రలో ‘రాహుల్‘ అనే నటుడు నటించాడు. అయితే ఆ నటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఇండస్ట్రీలో ఎందుకు రాణించలేకపోయాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

happy days tyson

హ్యాపీ డేస్ సినిమాలో శ్రావ్స్ (సోనియా దీప్తి) అంటూ ఓ అమ్మాయి వెనక తిరుగుతూ ఉండే యువకుడే టైసన్(రాహుల్). ఇతను హైదరాబాదులో 1986, నవంబరు 2న జన్మించాడు. ఇక ఈ నటుడి పూర్తి పేరు ‘రాహుల్ హరిదాస్’. అయితే సినిమాల మీద ఆసక్తితో వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రాహుల్ కు శేఖర్ కమ్మల తెరకెక్కిస్తున్న హ్యాపీ డేస్ సినిమాలో నటుడిగా ఆఫర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ప్రేక్షకులకు టైసన్ గా పరిచయమైయ్యాడు.కాకపోతే సినిమాలో అతడి పాత్ర పేరు అర్జున్. కానీ, సినిమాలో సీనియర్స్ ఇతడికి ముద్దుగా టైసన్ అని పేరు పెడతారు. ఇక ఆ సినిమాలో టైసన్ అలియాస్ రాహుల్ సన్నగా, కళ్లజోడుతో చాలా యాక్టివ్ గా కనిపిస్తాడు. ఇక అప్పటిలో ఈ నటుడి వయసు 21 ఏళ్లు. ఇక ఆ సినిమాలో ఈ టైసన్ అనే పాత్రలో రాహుల్ చాలా అద్బుతంగా నటించాడు.

ఈ క్రమంలోనే.. రాహులు ఇప్పటికీ ప్రేక్షకులకు హ్యాపీ డేస్ టైసన్ గానే గుర్తుండిపోయాడు. అంతలా అతని పాత్రకు మంచి ఫేమ్ లభించింది. అయితే విషయం ఏమిటంటే.. అంతలా ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ఆ తర్వాత ఇండస్ట్రీలో అంతగా క్లిక్ కాలేకపోయాడు. దీంతో ఈ కుర్రాడు ఇండస్ట్రీకి దూరమైయ్యాడని అంతా అనుకున్నారు. కానీ, నిజానికి రాహుల్ మధ్యలో రెయిన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, లవ్ యు బంగారం, వెంకటాపురం లాంటి సినిమాలు చేశాడు. అయితే అవి ఏవీ రాహుల్ కు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. నిజానికి రాహుల్ మంచి టాలెంట్ ఉన్న నటుడే కానీ, సరైన డైరెక్టర్ చేతిలో పడకపోవడం, మంచి పాత్రలు రాకపోవడంతో.. ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు.దీంతో అవకాశాలు తక్కువైపోవడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు.

ఇకపోతే రాహుల్ చాలా ఏళ్ల తర్వాత.. ఈ మధ్యనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. కాగా, ఈయన యంగ్ హీరో కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమాతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమలో రాహుల్.. అజీజ్ రెడ్డి అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కాకపోతే హ్యాపీడేస్ మూవీకి ఇప్పటికీ రాహుల్ చాలా మారిపోవడం గమన్హారం. అయితే ఇక మీదట అయినా రాహుల్ కెరీర్ కు బ్రేక్ పడుతుందా లేదో చూడాల్సింది. మరీ, హ్యాపీడేస్ రాహుల్ (టైసన్) బ్యాక్ గ్రౌండ్ సినీ కెరీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetmarsbahismatbet girişganobetpokerklasjojobetCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet GirişJojobet Giriş