iDreamPost
android-app
ios-app

హనుమాన్‌ హీరో తేజ సజ్జ సంచలన వ్యాఖ్యలు.. రవితేజ వల్లే మాకు ఇబ్బందులు

  • Published Jan 29, 2024 | 12:16 PM Updated Updated Jan 29, 2024 | 12:16 PM

తాజాగా మాస్ మహరాజా, హనుమాన్ హీరో తేజ సజ్జా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే రవితేజ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నమని అతని వల్ల ఇండస్ట్రీలో కష్టంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఏం జరిగిదంటే..

తాజాగా మాస్ మహరాజా, హనుమాన్ హీరో తేజ సజ్జా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే రవితేజ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నమని అతని వల్ల ఇండస్ట్రీలో కష్టంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఏం జరిగిదంటే..

  • Published Jan 29, 2024 | 12:16 PMUpdated Jan 29, 2024 | 12:16 PM
హనుమాన్‌ హీరో తేజ సజ్జ సంచలన వ్యాఖ్యలు.. రవితేజ వల్లే మాకు ఇబ్బందులు

ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్వకత్వం వహించిన హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థీయేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ గా అమృతా అయ్యార్ నటించగా , వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మెరిసారు. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన హనుమాన్ సినిమా అందరీ అంచనాలను తారుమారు చేసి రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో పలువురు ప్రశంసలను అందుకుంటూ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే హనుమాన్ మూవీ రూ.250 కోట్లు కలెక్షన్స్ రాబట్టగా.. త్వరలోనే రూ.300 కోట్ల వైపు శర వేగంగా అడుగులు వేస్తోందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తేజ సజ్జ, హీరో రవితేజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా మాస్ మహా రాజా వల్లే మాకు ఇన్ని ఇబ్బందులు అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మాస్ మహా రాజా తాజాగా నటించిన ఈగల్ సినిమా వచ్చే నెల ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతున్న సంగతీ తెలిసిందే. ఈ సందర్భంగా యంగ్ హీరో తేజ సజ్జాతో పీపుల్స్ మీడియా వారు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ వీడియోను ప్లాన్ చేశారు. ఇక ఆ వీడియోలో తేజ, రవితేజ కలిసి పలు విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే.. ముందుగా రవితేజ హనుమాన్ మూవీ మంచి సక్సెస్ ని అందుకోవడంతో తేజకు శుభాకాంక్షలు తెలుపుతారు. ఆ తర్వాత తేజ మీ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటారని రవితేజను అడుగుతాడు. అప్పుడు రవితేజ స్పందిస్తూ.. నాకు ఎలాంటి సంబంధం లేదని , నేను డైరెక్టర్లను పెట్టమంటున్నాన అని అంటారు. అయితే తేజ నాకు తెలియక అడుగుతున్నా అనడంతో.. ఇద్దరు ఉంటే కలర్ ఫుల్ గా ఉంటుందని రవితేజ వివరిస్తారు. ఆయన మాటాలకి తేజ పలు ఫన్నీ కామెంట్స్ చేశాడు.

teja sajja shocking comments about raviteja

” మీ వల్ల కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే యంగ్ హీరోస్ అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. సినిమాల్లో హీరోయిన్లు దొరకడం లేదు. ఎందుకంటే ఉండేదే మొత్తం 15 మంది హీరోయిన్లు కావచ్చు. ఇక మీరు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఇద్దరిద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. దానకి ఆడిషన్ మాత్రం నలుగురుని చేస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే 12 మంది వరకు ప్రమోషన్స్ చేస్తున్నారు. అందుకే మాకు చాలా ప్లాబ్లమ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. దానికి రవితేజ నవ్వుతూ.. ఇక నుంచి ఆ సమస్య ఉండదని చెబుతారు”. అలా పలు ఆసక్తికరమైన విషయాలను సరదాగా చర్చించుకుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి, మాస్ మహారాజా వల్ల ఇబ్బంది అవుతుంది అంటూ తేజ చేసిన వ్యాఖ్యల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique