iDreamPost
android-app
ios-app

అమ్మ చేతిలోని ఈ చిన్నారి.. ఒక్క మూవీతోనే స్టార్ అయిపోయింది

  • Published Mar 13, 2024 | 5:54 PM Updated Updated Mar 13, 2024 | 5:54 PM

ఈ ఫోటోలో ఓ హీరోయిన్ ఉంది. ఒక్క మూవీతోనే స్టార్ హోదాను కొల్లగొట్టడమే కాదూ.. పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

ఈ ఫోటోలో ఓ హీరోయిన్ ఉంది. ఒక్క మూవీతోనే స్టార్ హోదాను కొల్లగొట్టడమే కాదూ.. పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

  • Published Mar 13, 2024 | 5:54 PMUpdated Mar 13, 2024 | 5:54 PM
అమ్మ చేతిలోని ఈ చిన్నారి..  ఒక్క మూవీతోనే  స్టార్ అయిపోయింది

రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. హీరోయిన్‌గా రాణించాలనుకుంటున్న కొంత మంది అమ్మాయిలు..తమ మాతృ భాషలో కాకుండా మరో లాంగ్వేజ్ చిత్రాలతో పాపులరిటీని దక్కించుకుంటున్నారు. పరాయి ఇండస్ట్రీలో పాగా వేస్తున్నారు. చాలా మంది హీరోయిన్ల జర్నీ చూస్తే ఇది నిజమనిపించకమానదు. నార్త్ ఇండియాలో పుట్టిన భామలు కొందరు.. సౌత్ ఇండియన్ మూవీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ నటనలో ప్రావీణ్యం సంపాదించి, రెండు మూడు హిట్స్ కొట్టగానే, తిరిగి బాలీవుడ్ బాట పడుతున్నారు. అలాగే దక్షిణాది అమ్మాయిలు కూడా తమ భాషలో కాకుండా.. మరో ఇండస్ట్రీలో స్టార్ నటీమణిగా చెలామణి అవుతున్నారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీ ఈ లిస్ట్‌లోకే వస్తుంది.

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. ఇక్కడ స్టార్ డమ్ సంపాదించింది ఈ బ్యూటీ. ఈ ఫోటోను చూశారా..అమ్మ చేతిలో ఆడుకుంటున్న ఈ పాప.. ఒక్క సినిమాతో ఇప్పుడు ఇండియా వైడ్ తెలిసింది. చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆమె.. తెలుగులో ఓ యాంకర్ సరసన హీరోయిన్‌గా పనిచేసింది. రామ్, శ్రీ విష్ణు హీరోలతో నటించి.. ఆ తర్వాత వచ్చిన మూవీతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. పుట్టింది చెన్నై అయినా.. బెంగళూరులో పెరిగింది. కానీ మలయాళ ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టి.. కోలీవుడ్ నాట వచ్చిన రోల్స్ చేసుకుంటూ..టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. హనుమాన్ మూవీ హీరోయిన్ అమృతా అయ్యర్. ఆ పక్కనే కూర్చొని తదేకంగా చూస్తున్న అమ్మాయి.. ఆమె సోదరి.

తంతే నేతి బూరెల గంపలో పడింది అమ్మడు. ఒక్క మూవీతోనే పాన్ ఇండియా రేంజ్ స్టేటస్ కొట్టేసింది. గతంలో సుమారు 15 సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఈ ఒక్క చిత్రంతో వచ్చి పడింది. పద్మ వ్యూహం అనే మలయాళ చిత్రం ద్వారా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో నటించిన విషయం.. ఆమెకు తప్ప.. మరెవ్వరికీ తెలియదు. కానీ తెనాలి రామన్ అనే చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసింది. లింగ, పోకిరి రాజాలో కూడా అటువంటి పాత్రలే. ఇక తేరీ( పోలీసోడు) చిత్రంలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. బిగిల్ చిత్రంలో కూడా నటించంది. రామ్ రెడ్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. యాంకర్ ప్రదీప్ సరసన ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఆమెకు పేరు తెచ్చింది.  తమిళంలో లిఫ్ట్, కాఫీ విత్ కాదల్ చేసింది.  తెలుగులో శ్రీ విష్ణు సరసన పాల్గుణ, హనుమాన్ చిత్రాల్లో మెరిసింది.  ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఓవర్ నైట్ స్టార్ నటి అయిపోయింది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio