P Venkatesh
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రెండో రోజు ఎంత వసూలైందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రెండో రోజు ఎంత వసూలైందంటే?
P Venkatesh
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. భారీ అంచనాలతో తెరెక్కిన ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదలైంది. మాస్ యాక్షన్స్ తో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాపై మహేష్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. స్టైలిష్ గా, స్మార్ట్ గా కనిపించే మహేష్ మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో థియేటర్లలో మాస్ జాతర కొనసాగుతోంది. ఆడియెన్స్ నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైన తొలిరేజే రూ. 94 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ వసూల్ చేసింది.
గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా వసూలైన కలెక్షన్లను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ తాజాగా ప్రకటించింది. మూవీ విడుదలైన రెండు రోజుల్లో మొత్తం రూ. 127 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. మొదటి రోజు అన్ని సెంటర్స్ కలిపి 94 కోట్లు రాబట్టిన గుంటూరు కారం సినిమా రెండో రోజు 33 కోట్లని కలెక్ట్ చేయడంతో టోటల్ కలెక్షన్స్ 127 కోట్లకు చేరుకున్నాయి. ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ 135 కోట్లు కాగా… అందులో 66 కోట్లని రెండు రోజుల్లోనే కలెక్ట్ చేయడంతో గుంటూరు కారం 50% పైనే బిజినెస్ రికవరీ చేసేసింది. మూడో రోజు కూడా గుంటూరు కారం హవా కొనసాగనున్నది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధా కృష్ణ నిర్మించిన గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం కీలక పాత్రల్లో నటించారు. మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 💥#GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide 🔥
ఈ భోగికి మీలో ఉన్న Egos & Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు ✨
Watch the #BlockbusterGunturKaaram at cinemas… pic.twitter.com/1OvKeHnM36
— Haarika & Hassine Creations (@haarikahassine) January 14, 2024