iDreamPost

మహేశ్ బాబు మూలన కూర్చొని ఏడవాలా? గుంటూరు కారం నిర్మాత ఫైర్!

ఈ సంక్రాంతికి మాస్ మసాలా చిత్రం గుంటూరు కారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లను కొల్లగొట్టి.. రూ. 300 కోట్ల వైపుకు పరుగులు పెడుతుంది. అయితే ఈ మూవీపై వచ్చిన నెగిటివ్..

ఈ సంక్రాంతికి మాస్ మసాలా చిత్రం గుంటూరు కారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లను కొల్లగొట్టి.. రూ. 300 కోట్ల వైపుకు పరుగులు పెడుతుంది. అయితే ఈ మూవీపై వచ్చిన నెగిటివ్..

మహేశ్ బాబు మూలన కూర్చొని ఏడవాలా? గుంటూరు కారం నిర్మాత ఫైర్!

సంక్రాంతి రేసులో బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన ఈ మూవీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జనవరి 11న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల రూపాలను కొల్లగొట్టింది. మదర్, సన్ సెంటిమెంట్, కావాల్సినంత యాక్షన్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాకు హిట్ అందించారు ప్రేక్షకులు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఆయన వేసిన స్టెప్పులకు ఈలలు వేస్తూ గోల గోల చేసేస్తున్నారు. అయినప్పటికీ.. తొలి రోజు వచ్చిన నెగివిటికీ కలెక్షన్లు కాస్త తగ్గాయని వస్తున్న వార్తల నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టారు.

‘సినిమా చాలా బాగుంది. అందరూ బయ్యర్స్ బ్రేక్ ఈవెన్‌కు వచ్చేశారు. నచ్చని వాళ్లకు చెబుతామని ఈ ప్రెస్ మీట్ పెట్టా. స్పెషల్ షోలో నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేదాక అలాగే టాక్ వచ్చింది. కానీ వాళ్లు వచ్చాక సినిమా బాగుందని అన్నారు. మదర్, సన్ సెంటిమెంట్‌ను ఎంజాయ్ చేశారు. అందుకే ఈ రెవెన్యూ వచ్చింది’ అన్నారు. అలాగే సినిమాపై రివ్యూస్ ఎఫెక్ట్ చేయలేదని అన్నారు. అయితే ఈ సినిమాలో ఏ ప్రాబ్లం లేదా అన్న ప్రశ్నకు.. ‘సినిమా ఏంటో చెబుతా.. జయరాం క్యారెక్టర్ ఆయన.. వాళ్ల వైఫ్ ఎందుకు వదిలేసిందో అతనికి తెలుసు. రీజన్ ఉంది. కానీ 25 ఏళ్ల క్రితం మహేష్ బాబుకు తల్లి ఎందుకు వదిలేసిందో తెలియదు’ ఇదే కథ అని చెప్పాడు నాగవంశీ.

Should Mahesh Babu sit in the corner and cry

‘పోకిరీ అని ఊహించుకుని వస్తే.. కొంత మంది డిజప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అది రీచ్ అవ్వాల్సిన ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. కొంత మంది రివ్యూస్‌లో ఎమోషన్ లేదండీ అంటూ రాస్తున్నారు. ఎమోషన్ అంటే ఏంటీ.. మహేష్ బాబు కూర్చొని ఏడుస్తుంటాడాలా ఏంటీ’ అంటూ ఫైర్ అయ్యారు . ’నేను ఫ్యామిలీ సినిమా అని ముందుగా ప్రమోట్ చేయకపోవడం వల్ల బ్యాక్ లాష్ వచ్చిందేమో అనుకుంటున్నా. స్పెషల్ షో, ఫ్యామిలీ జోనర్ అని చెప్పక పోవడం వల్ల కాస్త ఆడియన్స్ నిరాశ పడ్డారు. అయినా ఫ్యాన్స్ సపోర్టు చేశారు. ఇలాంటి నెగిటివ్ వీడియోస్ పంపిందీ వాళ్లే’ అంటూ మరికొన్ని విషయాల గురించి మాట్లాడారు. మరీ నాగ వంశీ చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి