iDreamPost
android-app
ios-app

ఒకేసారి రంగంలోకి దిగుతున్న గేమ్ చేంజర్, గుంటూరు కారం!

  • Author ajaykrishna Published - 03:50 PM, Thu - 26 October 23

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. ఎందుకంటే.. కొన్ని కాంబినేషన్స్ సెట్ అయినప్పుడు అంచనాలు ఏర్పడతాయి. అలా సెట్ అయిన కాంబోలో బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అభిమానులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోరుతుంటారు.

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. ఎందుకంటే.. కొన్ని కాంబినేషన్స్ సెట్ అయినప్పుడు అంచనాలు ఏర్పడతాయి. అలా సెట్ అయిన కాంబోలో బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అభిమానులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోరుతుంటారు.

  • Author ajaykrishna Published - 03:50 PM, Thu - 26 October 23
ఒకేసారి రంగంలోకి దిగుతున్న గేమ్ చేంజర్, గుంటూరు కారం!

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. ఎందుకంటే.. కొన్ని కాంబినేషన్స్ సెట్ అయినప్పుడు అంచనాలు ఏర్పడతాయి. అలా సెట్ అయిన కాంబోలో బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అభిమానులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోరుతుంటారు. మేకర్స్ అప్డేట్స్ అందిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఫ్యాన్స్ కి వెయిటింగ్ తప్పదు. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న రెండు బిగ్గెస్ట్ మూవీస్ అప్డేట్స్ కోసం.. అంటే అందులోనూ ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఆ సినిమాలు ఎవరో కాదు.. ఒకటి గేమ్ చేంజర్, రెండు గుంటూరు కారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో.. దిల్ రాజు ప్రొడక్షన్ లో 50వ సినిమాగా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఎందుకంటే.. శంకర్ సినిమాలు ఎలా ఉంటాయో ఆడియన్స్ కి తెలియనిది కాదు. ఈ సినిమా దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ.. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు. పైగా టైటిల్ పోస్టర్ తప్ప ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. సో.. ఈ సినిమా నుండి ఖచ్చితంగా అప్డేట్స్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయగా.. రానున్న దీపావళికి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఇక ఇదే బాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ కూడా రెడీ అవుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. మహేష్ కాంబినేషన్ లో మూడోది. ఇప్పటికే పోస్టర్స్, చిన్న గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశారు. కాగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం నుండి అప్డేట్స్ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. గేమ్ చేంజర్ మాదిరి గుంటూరు కారం టీమ్ కూడా దీపావళికి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే యోచనలో ఉందట. ఇంకా అధికారికంగా అనౌన్స్ కాలేదు. కానీ.. లిరికల్ సాంగ్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే.. ఈ రెండు సినిమాలకు కామన్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చూడాలి మరి దీపావళికి ఎలాంటి సర్ప్రైజ్ లు ఇస్తాడో.. ఇక ఈ రెండు సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

ఇదీ చదవండి: ఒకేసారి రంగంలోకి దిగుతున్న గేమ్ చేంజర్, గుంటూరు కారం!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet