Venkateswarlu
ఆమె నటించిన స్టార్ హీరో సినిమా అతి త్వరలో విడుదల కానుంది. ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది.
ఆమె నటించిన స్టార్ హీరో సినిమా అతి త్వరలో విడుదల కానుంది. ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది.
Venkateswarlu
అందాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గ్లామర్ వరల్డ్‌లో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా లాంటి పోటీల్లో పాల్గొని విన్నర్‌గానో.. రన్నర్‌గానో నిలిచిన వారిని ఎక్కువగా సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి, ప్రియాంక చోప్రాతో పాటు చాలా మంది అందాల పోటీల్లో పాల్గొన్న తర్వాత మూవీస్‌లోకి వచ్చిన వాళ్లే. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఈ విధంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
2019లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘‘ అప్‌స్టార్స్’’ అనే హిందీ సినిమాలో నటించింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత 2021లో ‘‘ ఇచట వాహనములు నిలుపరాదు’’ అన్న మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. రవితేజతో కిలాడీ, అడవి శేష్‌తో హిట్ 2 సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన మోస్ట్ అవేటింగ్ మూవీ ‘గుంటూరు కారం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది.
ఆమె మరెవరో కాదు.. మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది. వీఎస్ 10, మట్కా, లక్కీ భాస్కర్ సినిమాల్లో నటిస్తోంది. కాగా, ఫెమీనా మిస్ ఇండియా 2018 ఫైనల్ రౌండ్‌లో మీనాక్షి చౌదరికి ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘ సక్సెస్ లేదా ఫెయిల్యూర్.. జీవితంలో ఉత్తమైన గురువు ఎవరు?’’ అని జడ్జీలు ప్రశ్నించగా.. ‘‘ నా జీవితంలో నేను చాలా విజయాలను, అపజయాలను చూశాను. విజయం నన్ను సంతోష పెట్టింది. ఫెయిల్యూర్ నన్ను వెనక్కు పడేసి..
నిజమైన విజయం అంటే ఏంటో చెప్పింది. అదే నాకు హర్డ్ వర్క్ గురించి నేర్పించింది. మీరు ఏం చేస్తున్నారు.. ఎక్కడున్నారని ముఖ్యం కాదు.. ఫెయిల్యూర్.. విజయం ఎంత ముఖ్యమైనదో చెబుతుంది. అందుకే.. నేను ఫెయిల్యూర్‌ను మంచి గురువుగా భావిస్తాను. అదే మనకు సక్సెస్ అంటే ఏంటో నేర్పిస్తుంది’’అని సమాధానం ఇచ్చింది. ఈ కాంపిటీషన్‌లో మీనాక్షి రన్నర్ అప్‌గా నిలిచింది. మరి, మీనాక్షి చౌదరి ఇచ్చిన ఈ అద్భుతమైన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.