Venkateswarlu
తెలుగు సినిమాలతో ఆమె తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత తమిళంలో స్థిరపడ్డారు. స్టార్ హీరోయిన్‌గా మారారు. తెలుగుకు పూర్తిగా దూరం అయ్యారు.
తెలుగు సినిమాలతో ఆమె తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత తమిళంలో స్థిరపడ్డారు. స్టార్ హీరోయిన్‌గా మారారు. తెలుగుకు పూర్తిగా దూరం అయ్యారు.
Venkateswarlu
తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు రావటం.. స్టార్‌లుగా ఎదగటం చాలా కష్టం అని ఓ టాక్ ఉంది. అది నిజమే అన్నట్లుగా ప్రస్తుత కాలంలో తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన దాఖలాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు సావిత్రి, జమున, అంజలి, జయసుధ, జయప్రద లాంటి వారు హీరోయిన్లుగా రాణించారు. కానీ, ఇప్పుడు వేళ్ల మీద లెక్కబెట్టడానికి కూడా తెలుగు అమ్మాయిలు లేరు. అయితే, తెలుగు అమ్మాయిలకు వేరే భాషల్లో అవకాశాలు వస్తూ ఉన్నాయి.
అక్కడ హీరోయిన్లుగా నిలదొక్కుకుని పేరు తెచ్చుకున్నాక.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ కెరీర్‌ను ప్రారంభించి అవకాశాలు రాక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. తర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి వస్తున్నారు. కానీ, ఇక్కడ కొంత కాలం వరకే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. తర్వాత అవకాశాలు తగ్గిపోతున్నాయి. పైన కనిపిస్తున్న చిన్నారి తెలుగులో కెరీర్‌ను ప్రారంభించింది. ఇక్కడ సరైన అవకాశాలు రాకపోవటంతో తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది.
అక్కడ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆ స్టార్ డమ్ ఎక్కువ కాలం నిలవలేదు. కొంత కాలానికే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అరకొరగా హీరోయిన్ రోల్స్ చేస్తోంది. పై ఫొటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంజలి. ఆమె 2006లో వచ్చిన ‘ఫొటో’ అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
మరుసటి సంవత్సరం ఆమె నటించిన తెలుగు సినిమా ‘ ప్రేమ లేఖ రాశా’ విడుదల అయింది. అదే సంవత్సరం ‘కత్తురదు తమిళ్’ అనే చిత్రంతో తమిళ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగుకు దూరం అయ్యారు. తమిళంలో స్టార్ హీరోయిన్‌గా మారారు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. తమిళంతో పాటు కన్నడలో కూడా సినిమాలు చేయటం మొదలుపెట్టారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 2013లో మసాలా సినిమాతో మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.
2022లో మాచర్ల నియోజకర్గం మూవీలో ఐటమ్ సాంగ్‌తో జనాల్ని అలరించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘గీతాంజలి 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా త్వరలో విడుదల కానుంది. మరి, తెలుగు అమ్మాయి గీతాంజలి సినీ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.