iDreamPost
android-app
ios-app

ఈ బూరె బుగ్గల చిన్నారిని గుర్తుపట్టారా..? మన యువరాణి..

  • Published Dec 15, 2023 | 3:09 PM Updated Updated Dec 15, 2023 | 3:09 PM

సోషల్ మీడియాలో ఇప్పుడో ట్రెండ్ నడుస్తోంది. అప్పుడు, ఇప్పుడు, త్రో బ్యాక్ అంటూ కొత్త కొత్త ఐడియాలతో స్టార్స్ తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. మరి కొంత మంది తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్ల పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే..?

సోషల్ మీడియాలో ఇప్పుడో ట్రెండ్ నడుస్తోంది. అప్పుడు, ఇప్పుడు, త్రో బ్యాక్ అంటూ కొత్త కొత్త ఐడియాలతో స్టార్స్ తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. మరి కొంత మంది తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్ల పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే..?

  • Published Dec 15, 2023 | 3:09 PMUpdated Dec 15, 2023 | 3:09 PM
ఈ బూరె బుగ్గల చిన్నారిని గుర్తుపట్టారా..? మన యువరాణి..

ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాల్యం ఓ మధుర జ్ఞాపకం. అది చాలా ముఖ్యమైనది కూడా.. ఆ క్షణాలను నెమరు వేసుకోడమే తప్ప.. తిరిగి పొందలేము. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. నటీ నటుల చిన్న నాటి ఫోటోలను పెట్టి  గెస్ ది స్టార్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. దీనితో తమ ఫేవరెట్ యాక్టర్స్ చిన్న నాటి ఫోటోలను అభిమానులు వైరల్ చేస్తున్నారు. తాజాగా ఓ ముద్దుల చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. మీకు కనిపిస్తున్నఈ ఫొటోలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న బుల్లెమ్మ.. ప్రస్తుతం నటిగా, భార్యగా, తల్లిగా పరిపూర్ణ జీవితాన్ని సాగిస్తుంది.

నటిగా మంచి ఫామ్ లో  ఉన్నపుడే.. ముంబయికి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లి అయింది. ఆ తర్వాత కూడా అదే ఉత్సాహంతో ఇప్పటికీ కథానాయికగా బిజీగా ఉంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో కాదు తన అందంతో, నటనతో కుర్రకారు హృదయాలను దోచేసిన మన టాలీవుడ్ చందమామ ‘కాజల్ అగర్వాల్’. 2007 లో విడుదలైన ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కాజల్. చందమామతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.  కాగా 2009 లో రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మగధీర’ చిత్రం ద్వారా కాజల్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం చిత్రాలలో కాజల్ మంచి పాత్రలను పోషించింది. ఇక 2020లో తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది.

ఆ తర్వాత 2022లో ఈ అమ్మడు నీల్ కిచ్లూకి జన్మనిచ్చింది. ఇలా నిజజీవితంలో అటు తల్లిగా, ఇటు భార్యగా బాధ్యతలు నిర్వహించడం సంతృప్తిగా ఉందంటూ.. కొన్ని ఇంటర్వూస్ లో కూడా కాజల్ చెప్పుకొచ్చింది. అయితే, బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని.. తిరిగి తాజాగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ‘భగవంత కేసరి’ సినిమాతో తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఎప్పటికపుడు తన సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలను, లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం కాజల్.. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రాబోతున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. సినిమాలతో పాటు, కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ అమ్మడు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా క్షణం తీరిక లేకుండా వ్యక్తిగత జీవితాన్ని, సినిమా రంగాన్ని సమతుల్యంగా నడిపిస్తుంది. ఇక కాజల్ చిన్న నాటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి, ఈ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio