iDreamPost
android-app
ios-app

ఈ బబ్లీ గర్ల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

  • Published Jan 19, 2024 | 4:50 PM Updated Updated Jan 19, 2024 | 4:50 PM

ఈ ఫోటోలో చబ్బీ చబ్బీగా కనిపిస్తున్న ఈ చిన్నారిని చూశారా.. ఇప్పడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ మాత్రమే కాదూ.. బాలీవుడ్ నాట కూడా పాగా వేసింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో చబ్బీ చబ్బీగా కనిపిస్తున్న ఈ చిన్నారిని చూశారా.. ఇప్పడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ మాత్రమే కాదూ.. బాలీవుడ్ నాట కూడా పాగా వేసింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

  • Published Jan 19, 2024 | 4:50 PMUpdated Jan 19, 2024 | 4:50 PM
ఈ బబ్లీ గర్ల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

కొంత మంది హీరోయిన్ల ఇప్పటి, చిన్నప్పటి ఫోటోలు చూస్తుంటే.. అస్సలు నమ్మబుద్ది కాదు. ఈ చిన్నారి పాప.. హీరోయినా.. అనుకుంటూ ఉంటారు. పోలికలు చూసి ఎవరో .. చెప్పడం కష్టం. అంతలా మారిపోతూ ఉంటారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బబ్లీ గర్ల్ చూశారా.. ఎవరో గుర్తు పట్టండి అంటే.. ఠక్కున చెప్పగలరా..? కానీ ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఒక్క మలయాళ ఇండస్ట్రీని తప్ప.. దక్షిణాది పరిశ్రమల్లోని అన్ని లాంగ్వేజ్‌లో వర్క్ చేసింది బ్యూటీ. యంగ్ హీరోల నుండి.. బడా హీరోల వరకు జత కట్టేసింది. అలాగే బీటౌన్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇన్ని క్లూస్ ఇచ్చిన ఆమె ఎవరో కనిపెట్టేశారా..? అయ్యో సాధ్యం కావడం లేదు కదూ.. ఇంకెందుకు ఆలస్యం చెప్పస్తాములెండి.

ఓ చిన్న సినిమా ద్వారా తెలుగు నాట అడుగుపెట్టి.. యంగ్ హీరోతో జతకట్టి.. తన అమాయకపు నటనతో మాయలో పడేసిన ఈ సుందరి పేరు రకుల్ ప్రీత్ సింగ్. వెంటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో ‘ప్రార్థన… ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ’ అంటూ తన నటనతో అభిమానులను చూరగొంది రకుల్. అప్పటికే తెలుగులో కెరటం అనే మూవీ వచ్చినప్పటికీ.. ఈ బ్యూటీకి పేరు రాలేదు. ఆ మూవీ హిట్ ఆమెను వెను దిరిగి చూసుకోనివ్వకుండా చేసింది. లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక వంటి చిత్రాల్లో నటించింది. నాలుగేళ్ల పాటు ఏక ధాటిగా తెలుగులో మాత్రమే సినిమాలు చేసింది.

అటు కోలీవుడ్, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రన్ చేస్తున్నప్పటికీ ఫెయిల్యూర్స్ బాట పట్టాయి. నాగార్జున లాంటి స్టార్ యాక్టర్, నితిన్ వంటి యంగ్ నటుడితో జతకట్టినా అమ్మడికి సక్సెస్ అడ్రస్ కానరాలేదు. కొండ పొలం ఓకే అనిపించింది. కానీ 2022లో మొత్తం హిందీ సినిమాలే చేసింది. అయితే కొండ పొలం తర్వాత నేరుగా తెలుగు సినిమాలు చేయలేదు అమ్మడు. ఇటీవల కోలీవుడ్ మూవీ అయలాన్ లో నటించింది. తెలుగు నాట కాస్త ఆలస్యంగా విడుదల కానుంది ఈ మూవీ. ఈ సినిమాతో పలకరించనుంది. అలాగే ఇండియన్ 2 షూటింగ్ దశలో ఉండిపోయింది. హిందీల మరో చిత్రం చేస్తోంది. కాగా, ఇప్పుడు రకుల్.. పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెల ఆమె తన ప్రియుడు జాకీ భగ్నానీని మనువాడబోతోంది.  ఆమె చిన్న నాటి ఫోటో చూడంగానే.. రకుల్ అని గుర్తు పట్టారా లేదా.. ఆ విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss