iDreamPost
android-app
ios-app

ఈ స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా? ఈయన పేరింటే బీ టౌన్ పోసేసుకుంటుంది!

Guess The Star Director: ఈ ఫొటోలో ఉన్న స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా? ఈయన దెబ్బకి బాలీవుడ్ కూడా తోక ముడుచుకుంది.

Guess The Star Director: ఈ ఫొటోలో ఉన్న స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా? ఈయన దెబ్బకి బాలీవుడ్ కూడా తోక ముడుచుకుంది.

ఈ స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా? ఈయన పేరింటే బీ టౌన్ పోసేసుకుంటుంది!

ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా అనగానే అందరూ ఇప్పుడు తెలుగు సినిమా అనేస్తున్నారు. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ స్థాయికి చేరింది అంటే ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్, హీరోల కృషి ఉందని చెప్పాలి. మేమే తోపులం అనుకుంటూ విర్రవీగిన బాలీవుడ్ కొమ్ములు విరిచి.. ఇదీ మా సత్తా అంటూ చాటిన టాలీవుడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాకి గుర్తింపు వస్తోంది అంటే అది టాలీవుడ్, సౌత్ సినిమా వల్లే అని చెప్పాలి. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ ఈ పిక్ లో ఉన్నాడు గుర్తు పట్టారా?

బాలీవుడ్ సినిమా.. వీళ్ల ఓవరాక్షన్ గురించి ఎంత చెప్పినా ఇంకా కొంచం మిగిలే ఉంటుంది. ఇండియన్ సినిమాని ఉద్దరిస్తోంది మేమే అనే భ్రమలో బతుకుతూ ఉండేవాళ్లు. కానీ, ఎప్పుడైతే సౌత్ సినిమా హద్దులు చెరుపుకుని వరల్డ్ వైడ్ మార్కెట్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి కాస్త నోరు అదుపులో పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. లోపల కాలుతూ ఉన్నా పైకి చెప్పుకోలేని ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితులు బాలీవుడ్ కు రావడానికి ఈ ఫొటోలో ఉన్న డైరెక్టర్ కూడా ఒక కారణంగా చెప్పచ్చు. వాళ్ల గడ్డ మీద వాళ్లనే చెప్పి మరీ కొట్టిన ఘనత ఈ తెలుగు స్టార్ డైరెక్టర్ కు సొంతం.

హిట్టు కొట్టడం అంటే అదొక అద్భుతంగా బీ టౌన్ భావిస్తున్న తరుణంలో ఒక ఏ సర్టిఫికెట్ సినిమాతో రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. తన టేకింగ్ తో విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించేలా చేశాడు. ఇలా కూడా సినిమా తీయచ్చు అంటూ బాలీవుడ్ కి నేర్పించాడు. ఇప్పటికైనా గుర్తు పట్టారా? అదే అండి ఆయన మరెవరో కాదు.. టాలీవుడ్ వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అవును ఆ ఫొటోలో ఉంది సందీప్ రెడ్డి వంగానే. ఇన్నాళ్లు బారు జుట్టు, గడ్డంతో ఉండే సరికి చాలామంది గుర్తుపట్టలేదు. కానీ, తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నాడు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా గుండుతో ఉన్న వీడియో వైరల్ అవుతోంది. సందీప్ వంగా టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఉండే సో కాల్డ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, హీరోలకు సందీప్ రెడ్డి వంగా తన సినిమాతోనే సమాధానం చెప్పాడు. బయటి వారిని బాలీవుడ్ లో ఎదగనివ్వరు అనే నానుడిని కూకటి వేళ్లతో పెకలించేశాడు. బయటి వాళ్లు వస్తున్నారు అంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి అనే విషయాన్ని కాస్త బలంగానే చెప్పాడు. బాలీవుడ్ వాళ్లకు సక్సెస్ అంటే ఏంటో చూపించడమే కాకుండా.. అక్కడ జరిగే ఆధిపత్యం, నంబర్స్ గేమ్, కార్పొరేట్ బుకింగ్ మాఫియా గురించి బాహాటంగానే వ్యాఖ్యలు చేశాడు. ఎవరు సందీప్ ని, తన సినిమాని కామెంట్ చేసినా.. నిర్మొహమాటంగా ఇచ్చి పడేశాడు. అసలు సందీప్ ని కామెంట్ చేయడం కాదు కదా.. అతని పేరుని తల్చుకోవాలి అన్నా భయపడేలా చేసేశాడు.

ఇది కేవంల సందీప్ రెడ్డి వంగా విజయం మాత్రమే కాదు.. బాలీవుడ్ మీద టాలీవుడ్ సాధించిన విజయంగా చెప్పుకుంటున్నారు. ఇక తన కెరీర్ కి సంబంధించి అందరూ యానిమల్ పార్క్ తో వస్తాడు అనుకుంటున్నారు. కానీ, సందీప్ మాత్రం తర్వాతి ప్రాజెక్టు ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించాడు. కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ చిత్రాలు షూటింగ్ పూర్తైన తర్వాత స్పిరిట్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి స్పిరిట్ సినిమాపై వర్క్ చేస్తున్న విషయాన్ని స్పష్టం చేశాడు. మరి.. బాలీవుడ్ నే వణికించేస్తున్న సందీప్ రెడ్డి వంగాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి